Pakistan to allow Kulbhushan Jadhav to file a review appeal: గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్​భూషణ్​ జాదవ్​కు (Kulbhushan Jadhav case) మరోసారి ఊరట లభించింది. ఆయనకు విధించిన మరణ శిక్షపై అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం దక్కనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన అప్పీలు చేసుకునేందుకు వీలు కల్పించే బిల్లును పాకిస్థాన్ పార్లమెంట్ (Pak parliament) తాజాగా ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు (ICJ Kulbhushan Jadhav right) మేరకు పాక్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.


ఐసీజే ఆదేశాలు ఇలా..


గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై కుల్‌భూషణ్‌కు 2017లో పాకిస్థాన్​ మరణశిక్ష విధించింది. శిక్షను అపీల్‌ చేసుకునేందుకు వీలుగా ఆయనకు దౌత్యపరమైన సంప్రదింపులకు అవకాశం కల్పించకపోవడంపై అంతర్జాతీయ న్యాయస్ధాన్ని భారత్‌ ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఐసీజే.. కుల్‌భూషణ్‌ మరణశిక్షను పునఃసమీక్షించడం సహా అప్పీల్‌ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని 2019లో పాక్‌ను ఆదేశించింది.


Also read: ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ .. వీడియో


Also read: Ancient Sun Temple: ఈజిప్టులో వెలుగు చూసిన అతి ప్రాచీన సూర్య దేవాలయం ఇదే


జాదవ్ కేసు పూర్తి వివరాలు..


గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై.. కుల్​ భూషణ్​ జాదవ్​ను 2016లో అరెస్ట్​ చేసింది పాకిస్థాన్ సైన్యం​. అదే ఏడాది జాదవ్​పై తొలిసారి వార్తలొచ్చాయ్​. జాదవ్​ అరెస్ట్​పై భారత ప్రభుత్వం స్పందించి.. ఆయన్ను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.


2017 ఏప్రిల్​ 10న గుఢచర్యం కేసులో పాకిస్థాన్ సైనిక న్యాయస్థానం జాదవ్​కు మరణ శిక్ష విధించింది. దీనిపై తక్షణమే స్పందించింది భారత్​. ఇది కుట్రపూరితమైన నిర్ణయమని అభిప్రాయపడింది. ఏప్రిల్ 11న జాదవ్​ను విడిపించేదుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్​ స్పష్టం చేశారు.


2017 మే8న ఈ కేసుపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది భారత్​. దీనితో పాక్​ విధించిన మరణ శిక్షపై ఐసీజే స్టే విధించింది.
అంతర్జాతీయ న్యాయస్థానం ఒత్తిడితో 2017 డిసెంబర్​లో జాదవ్​ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతినిచ్చింది పాక్​ ప్రభుత్వం. ఆ తర్వాత ఈ కేసుపై పలుమార్లు విచారణలు జరిగాయి.


Also read: HIV cure without treatment: చికిత్స తీసుకోకుండానే హెచ్ఐవి నుంచి పూర్తిగా కోలుకున్న మహిళ


Also read: Mc Donalds: టాయ్‌లెట్ వివాదంలో చిక్కుకున్న మెక్‌డోనాల్డ్స్ సంస్థ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook