HIV patient cure without treatment: హెచ్ఐవికి ఎటువంటి వైద్య చికిత్స అవసరం లేకుండానే దాని నుంచి పూర్తిగా కోలుకున్న ఓ వ్యక్తిని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. ఇది అత్యంత అరుదైన కేసు అని... ఈ తరహా కేసు ప్రపంచంలో రెండవది అని చెప్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం హెచ్ఐవి (HIV) బారిన పడిన ఆ మహిళ (30) శరీరంలో ప్రస్తుతం దాని ఆనవాళ్లు ఎక్కడా లేవని వెల్లడించారు. తాజాగా ప్రచురితమైన 'అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్' జర్నల్‌లో ఇంటర్నేషనల్ సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
ఆ మహిళ అర్జెంటీనాలోని ఎస్పరెంజా నగరానికి చెందినదిగా జర్నల్‌లో పేర్కొన్నారు. ఇలా చికిత్స అవసరం లేకుండానే హెచ్ఐవి నుంచి కోలుకోవడాన్ని 'స్టెరిలైజింగ్ క్యూర్'గా పేర్కొంటారని తెలిపారు. ఆ మహిళ శరీరంలోని సుమారు 1.5 బిలియన్ల కన్నా ఎక్కువ కణాలను విశ్లేషించిన తర్వాతే ఈ నిర్దారణకు వచ్చినట్లు వెల్లడించారు. గతంలో 67 ఏళ్ల లొరీన్ విలెన్‌బర్గ్ అనే హెచ్ఐవి పేషెంట్ (HIV patient) కూడా ఎటువంటి చికిత్స లేకుండానే దాని నుంచి పూర్తిగా కోలుకున్నాడని పేర్కొన్నారు.
2013లో ఆ మహిళకు హెచ్ఐవి ఉన్నట్లు మొదటిసారి బయటపడింది. ఆమె శరీరంలోని బిలియన్ల కొద్ది కణాలను విశ్లేషించగా ఆమె హెచ్ఐవి సోకినట్లు తేలింది. అయినప్పటికీ 2019లో ఆమె గర్భం (Pregnant) దాల్చేవరకూ హెచ్ఐవికి సంబంధించి ఎటువంటి మందులు, చికిత్స తీసుకోలేదు. గర్భం దాల్చాక కడుపులో ఉన్న బిడ్డకు హెచ్ఐవి సోకకుండా వైద్య చికిత్స తీసుకుంది. ఆ సమయంలో వైద్యుల సూచన మేరకు టెనొవొవిర్, ఎమ్ట్రిసిటాబైన్, రాల్టెగ్రావిర్ ట్యాబ్లెట్లు ఆర్నెళ్ల పాటు వాడింది. దీంతో ఆమెకు ఆరోగ్యవంతమైన బిడ్డ ( హెచ్ఐవి నెగటివ్) పుట్టింది.
Also Read: Best Tourism Village: బెస్ట్ టూరిజం విలేజ్ గా పోచంపల్లి.. ఐక్యరాజ్యసమితి గుర్తింపు
ప్రస్తుతం ఆమె హెచ్ఐవి నుంచి పూర్తిగా కోలుకోవడంతో వైద్యులే (Doctors) ఆశ్చర్యపోతున్నారు. బహుశా వివిధ ఇమ్యూన్ మెకానిజమ్స్ కాంబినేషన్‌తో పాటు సైటోటాక్సిక్ T కణాలు వాటితో చేరడం వల్ల, శరీరంలోని నేచరుల్ ఇమ్యూన్ మెకానిజం కూడా దోహదపడటం వల్లే ఇది సాధ్యపడి ఉండవచ్చునని భావిస్తున్నట్లు అర్జెంటీనాకు చెందిన డా.నటాలియా తెలిపారు. గతంలో డా.నటాలియా ఆ మహిళకు హెచ్ఐవి (HIV AIDS) రీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. స్టెరిలైజింగ్ క్యూర్‌గా పరిగణిస్తున్న ఈ కేసుపై మరింత లోతుగా అధ్యయనం చేయడం ద్వారా మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook