Brazil New President: బోల్సనారో ఓటమి... బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డా సిల్వా..
Brazil New President: బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లూయిజ్ ఇన్‌సియో లులా డా సిల్వా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోపై ఆయన విజయం సాధించారు.
Brazil's Next President: బ్రెజిల్ అధ్యక్ష పీఠాన్ని మూడోసారి అధిరోహించాలని భావించిన బోల్సనారోకు చుక్కెదురైంది. లెఫ్టిస్ట్ వర్కర్స్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇన్‌సియో లులా డా సిల్వా (Luiz Inacio Lula da Silva) బ్రెజిల్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో 93.8 శాతం ఓట్లు పోలవ్వగా.. 77 ఏళ్ల డా సిల్వా 50.8% ఓట్లు, బోల్సోనారో 49.2% ఓట్లు సాధించారు. దీంతో మరోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్నారు సిల్వా. తాజాగా జరిగిన ఎన్నికల్లో తొలుత బోల్సోనారోనే ముందంజలో ఉన్నారు. చివరికి వచ్చే సరికి సిల్వా అధిక్యం పెరిగి..బోల్సోనారోకు తగ్గడంతో ఆయన ఓటమి పాలయ్యారు.
1970వ దశకంలో బ్రెజిల్‌లోని మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డా సిల్వా పోరాడారు. బ్రెజిల్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన అధ్యక్షుడిగా డా సిల్వాకు పేరుండేది. 2003 నుంచి 2010 వరకు ఆయన బ్రెజిల్ 35వ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణల రావడంతో పదవికి రాజీనామా చేశారు. లూలా 2018లో జైలు పాలయ్యారు మరియు ఆ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించబడ్డారు. ఆ ఎన్నికల్లో బోల్సోనారో (Jair Bolsonaro) గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన సిల్వాకు దేశంలో శాంతిని నెలకొల్పడమే అతని ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: South Korea Halloween stampede: హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 149 మంది మృత్యువాత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి