Bangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం.. భారత్ కీలక నిర్ణయం
Bangladesh Protests Live News: బంగ్లాదేశ్‌లో చెలరేగుతన్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆమె దేశం వీడి భారత్‌లో ఆశ్రయం కోసం వచ్చారు. ఇంతకు బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోంది..? ఈ స్థాయిలో ఆందోళనలకు కారణాలు ఏంటి..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Bangladesh Protests Live News: రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బంగ్లాదేశ్ భారీగా నిరసనలు జరుగుతున్నాయి. పౌరుల హింసాత్మక ఘటనలతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు 30 శాతం రిజర్వేషన్ కోటాను పునరుద్దరిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వగా.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా పౌరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు మొత్తం 300 మందిపైగా చనిపోవడం కలకలం రేపుతోంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకా ప్యాలెస్‌ను వీడి వెళ్లారు. ప్రధాని పదవికి ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దేశంలో నిరసనలు తారాస్థాయికి చేరడంతో ఆర్మీ రంగంలోకి దిగుతోంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
Latest Updates
Bangladesh Crisis Live Updates: బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. తాము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. తమ ప్రయాణికులకు ఢాకాకు వెళ్లడానికి.. తిరిగి రావడానికి బుకింగ్‌లతో రీషెడ్యూల్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై సపోర్ట్ చేస్తున్నామని ట్వీట్ చేసింది. మరింత సమాచారం కోసం 011-69329333/011-69329999 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
Bangladesh Crisis Live Updates: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్‌కతా-ఢాకా-కోల్‌కతా మైత్రి ఎక్స్‌ప్రెస్‌తో సహా ఆగస్టు 6 వరకు బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్లను రైల్వే రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
Bangladesh Crisis Live Updates: బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్‌లో శాంతిభద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వదంతులను పట్టించుకోవద్దని కోరారు. ఇది రెండు దేశాల మధ్య వ్యవహారం అని.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని తెలిపారు.
Bangladesh Crisis Live Updates: బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా.. సాయంత్రం ఆరు గంటలకు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది.
Bangladesh Crisis Live Updates: అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరిని అడ్డుకోవాలని ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్ సైన్యాన్ని కోరారు. ప్రజలు, దేశాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ఆర్మీపై ఉందని.. ఎన్నిక కాని ప్రభుత్వం అధికారంలో కూర్చోవడానికి అనుమతించొద్దని కోరారు. ప్రధాని పదవి నుంచి దిగిపోతే అభివృద్ధి అంతా వృథా అయిపోతుందని.. దేశం తిరిగి పుంజుకోలేదన్నారు.
Bangladesh Crisis Live Updates: దేశంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు. నిరసనకారులు హింసా మార్గాన్ని వీడాలని కోరారు. నిరసనలతో దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని.. ఎన్నో ప్రాణాలు పోయాయని అన్నారు. ఈ హింసను ఆపాలని.. తన ప్రసంగం తరువాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిసనలు తగ్గితే ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఉండదన్నారు.