Iran Israel War: కోటి మంది పౌరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ పైకి దూసుకువస్తున్న ఇరాన్ క్షిపణలు..అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన
Iranian missile attacks on Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగాజారాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో అప్రమత్తమైన సైరన్‌లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశించారు.
Israel Iran War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని, దేశవ్యాప్తంగా వైమానిక దాడుల సైరన్‌లు మోగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. నివాసితులు సురక్షిత ప్రదేశాలలో, బాంబు షెల్టర్ల దగ్గర ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అదే సమయంలో, మంగళవారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి సిద్ధమవుతోందని అమెరికా హెచ్చరించింది. దాడికి టెహ్రాన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది. ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్‌లో భూదాడి ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ చెప్పడంతో ఈ హెచ్చరికలు వచ్చాయి.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా సైనిక దాడి చేస్తే ఇరాన్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధికారి తెలిపారు. కాగా, నస్రల్లా హత్య ఇజ్రాయెల్ నాశనానికి దారితీస్తుందని ఇరాన్ పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవడానికి టెహ్రాన్ దళాలను మోహరించదని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.
ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల దాడి వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ కు తాము అండగా నిల్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పశ్చిమాసియాలోని అమెరికా బలగాలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. టెల్ అవీవ్, జెరూసలెం సమీపంలో వరుస పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇరాన్ దీటుగా ఇజ్రాయెల్ సాంకేతిక వ్యవస్థ క్షిపణులను పేల్చివేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి.
Latest Updates
- ఇరాన్ మిస్సైళ్ల దాడి ముగిసిందంటూ ప్రకటించిన ఇజ్రాయెల్ ఆర్మీ..బంకర్లలోనుంచి ప్రజలు బయటకు రావచ్చని పేర్కొన్న ఇజ్రాయెల్ సైన్యం
- ఇరాన్ ఈ దాడి ఘటనతో తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవల్సి ఉంటుందని హెచ్చరించిన ఇజ్రాయెల్ ఆర్మీ.
ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి మంగళవారం తెలిపారు.
టెల్ అవీవ్ లో నివసిస్తున్న భారతీయులకోసం ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసిన భారత రాయబార కార్యాలయం. ఈ రెండు నంబర్లు +972-547520711 మరియు +972-543278392
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించి భారత రాజబార కార్యాలయం
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత, ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో కాల్పులు.. 8 మంది మృతి
ఇజ్రాయెల్‌కు సహాయం చేసేందుకు అమెరికా సిద్ధం: బిడెన్
ఇజ్రాయెల్ పై నేరుగా సైనిక దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి వస్తుందని ఇరాన్ ను హెచ్చరించిన అమెరికా
-ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయం.
-జూలై 31న టెహ్రాన్‌లో పాలస్తీనా హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెహ్‌ను హత్య చేసిన ఇజ్రాయెల్
-సెప్టెంబర్ 27న లెబనాన్‌లోని బీరూట్‌పై భారీ వైమానిక దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్
-ఇరాన్ సైనిక సలహాదారుగా పనిచేసిన ఇరానియన్ బ్రిగేడియర్ జనరల్ అబ్బాస్ నిల్‌ఫౌషన్ నస్రల్లాను హతమార్చిన ఇజ్రాయెల్
- కోటి మంది పౌరులే లక్ష్యంగా ఇరన్ దాడులు
- టెల్ అవీవ్, జెరూసలెం సమీపంలో వరుసగా పేలుళ్లు
- ఇస్ఫాహాన్, తబ్రిజ్, ఖోరమాబాద్, కరాజ్, అరక్ వంటి ఇరానియన్ నగరాల నుంచి ఈ క్షిపణులను ప్రయోగం
ఇజ్రాయెల్ పై 400 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించిన ఇరాన్
ఇరాన్ దాడితో రక్షణ కోసం బంకర్లలోకి వెళ్ళిన లక్షలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు