Israeli Palestinian War Live: ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం.. భయంకరమైన దృశ్యాలు
Israel Palestine Conflict Live Updates: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. అసలు యుద్దం ఎందుకు మొదలైంది..? అక్కడి పరిస్థితి ఎలా ఉంది..? లైవ్ అప్‌డేట్స్ మీ కోసం..
Israel Palestine Conflict Live Updates: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య రణరంగం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు రాకెట్ల దాడులతో యుద్ధం మొదలైంది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేలకు పైగా రాకెట్లతో దాడులు చేసిన ఉగ్రవాదులు.. రోడ్డు మార్గంలో సరిహద్దుల్లో ప్రవేశించి ఆరాచాకాలకు తెగబడ్డారు. హమాస్ దాడికి ప్రతీగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' ప్రారంభించింది. గాజా తీరప్రాంతంపై వైమానిక దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోకి చొరబడిన తీవ్రవాదులు.. అక్కడి మహిళలను నగ్నంగా ఈడ్చుకుంటూ వెళ్తుతున్న వీడియోలు భయంకరంగా ఉన్నాయి. ఈ వార్‌లో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Latest Updates
హమాస్ జరిపిన ఉగ్రవాద దాడిలో ఇజ్రాయెల్‌లో మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు ఈఫిల్ టవర్ లైట్లు ఆఫ్ చేశారు.
హమాస్ సైనిక విభాగం అల్-నాసర్ సలా అల్-దిన్ బ్రిగేడ్స్ కమాండర్-ఇన్-చీఫ్ రాఫత్ అబు హిలాల్ అబూ అల్-అబ్ద్ ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యాడు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజాలోని రఫాలో ఒక ఇంటిపై బాంబు దాడిలో మరణించాడు.
గాజాలోని 800 హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని.. వందలాది మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి తెలిపారు. ఇంకా డజన్ల కొద్దీ ప్రజలు పట్టుబడ్డారని.. తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతోందన్నారు.
ఇజ్రాయెల్‌పై దాడుల తరువాత తీవ్రవాద గ్రూప్ హమాస్ నుంచి మరో షాకింగ్ ప్రకటన వెలుగులోకి వచ్చింది. యుద్ధం తీవ్రతరం చేసి వెస్ట్ బ్యాంక్, లెబనాన్‌కు విస్తరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ యుద్దం కారణంగా 600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. రెండు వేల మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.
హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో 10 మంది నేపాలీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లోని నేపాల్ ఎంబసీ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇజ్రాయెల్ తీరప్రాంత నగరమైన అష్కెలోన్‌లో కొంతమందిని బంధించి ఉగ్రవాదులు తీసుకువెళుతున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని.. తీవ్రవాదుల నుంచి వారిని కాపాడారు. అష్కెలోన్ నగరానికి సమీపంలో ఉన్న రహదారి గుండా వెళ్లేందుకు యత్నించగా.. రాడికల్స్‌ను అరికట్టడంలో ఇజ్రాయెల్ పోలీసులు విజయం సాధించారు. రహదారిని దిగ్బంధించి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
హమాస్ ఉగ్రవాదులు దాక్కున్న గాజా సైట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు కొనసాగిస్తోంది. "కొద్దిసేపటి క్రితం IAF ఫైటర్ జెట్‌లు హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌కు చెందిన కాంపౌండ్‌పై దాడి చేశాయి. ప్రస్తుతం IAF గాజా స్ట్రిప్‌లోని ఉగ్రవాద లక్ష్యాలను ఛేదించడం కొనసాగిస్తోంది" అని IAF తెలిపింది.
శనివారం నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య భీకరపోరు జరుగుతోంది. హమాస్ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 350 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించారు.
జికిమ్ బీచ్ ప్రాంతంలో ఐదుగురు హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఇజ్రాయెల్ నేవీ సిబ్బంది గుర్తించారు. చొరబాటుదారులందరినీ తమ దేశం నుంచి తరిమికొట్టే వరకు శాంతియుతంగా ఉండబోమని సైన్యం ప్రకటించింది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబర్ 14వ తేదీ వరకు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని చెప్పారు. ముందుగా బుకింగ్ చేసుకున్న అందరికీ రీఫండ్ చెల్లిస్తామన్నారు.
ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు ఓ యువతిని హత్య చేసి.. నగ్నంగా ఊరేగించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఆ యువతి ఎవరో తెలిసిపోయింది. జర్మనీకి చెందిన యువతిగా తేలింది. కనీసం మృతదేహం అయినా అప్పగించాలని ఆ యువతి తల్లి వేడుకుంటోంది.
భయాందోళనకు గురి చేస్తున్న దృశ్యాలు
"ఈరోజు తెల్లవారుజామున IAF ఫైటర్ జెట్‌లు మసీదులపై దాడి చేశాయి. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ భూభాగంలో జికిమ్ బీచ్ ప్రాంతంలో ఏడుగురు ఉగ్రవాదులను గుర్తించాం. ఐడీఎఫ్ నావికాదళ సైనికులు, ఐఏఎఫ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నివాస ప్రాంతాలలోకి చొరబడకుండా నిరోధించాయి" అని ఇజ్రాయెల్ వైమానిక దళం తెలిపింది.
గాజా నుంచి పనిచేస్తున్న హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించింది. 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' పేరుతో హమాస్ సైట్‌లను కూల్చివేయడానికి తన వైమానిక దళాన్ని మోహరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా స్ట్రిప్‌లో భారీ భూ కార్యకలాపాలకు సిద్ధమవుతోంది.
దాడులు, ప్రతీకార దాడులతో ఇజ్రాయిల్-పాలస్తీనా దేశాలు నలిగిపోతున్నాయి. రాకెట్ దాడులు, వైమానిక దాడులతో సాధారణ ప్రజానీకం మృత్యువాత పడుతున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
హమాస్ దాడి, ఇజ్రాయిల్ ప్రతిదాడుల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు ఇజ్రాయిల్ దేశానికి మిత్రదేశంగా ఉన్న ఇండియా ఆ దేశానికి సంఘీభావం ప్రకటించడమే కాకుండా అండగా ఉంటామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.