US Elections Results 2024 Live Updates: కలిసి పనిచేద్దాం మై ఫ్రెండ్.. ట్రంప్ విజయంపై ప్రధాని మోదీ అభినందనలు
US Election Results 2024 Live Updates: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 50 రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఈ పోలింగు సుదీర్ఘ ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
US Election Results 2024 Live Updates: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రటియ షురూ అయ్యింది. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ అన్నట్లు కొనసాగుతున్న ఎన్నికల పోరులో ఎవరు పై చేయి సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. గత సంవత్సరం రిపబ్లిక్ అండ్ పార్టీ తరఫున ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున బైడెన్ పోటీ చేయగా, బైడెన్ విజయం సాధించి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ దఫా డెమొక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన కమలా హారిస్ అమెరికా అధ్యక్ష పదవి కోసం డెమొక్రటిక్ తరఫున పోటీ చేస్తుండగా. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ అండ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా ఇప్పటికే అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ కౌంటీలో తొలి ఫలితం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ కౌంటీలో కేవలం 6గురు ఓటర్లు మాత్రమే ఉండటంతో తొలి ఫలితం విడుదల అయ్యింది.
Latest Updates
America Elections Results 2024 Live News: రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. చరిత్రలో ఇది గొప్ప పునరాగమనం అని.. భారీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
America Elections Results 2024 Live News: అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమైంది. ప్రస్తుతం ట్రంప్ 267 సీట్లలో విజయం సాధించగా.. కమలా హారిస్ 224 సీట్లు సొంతం చేసుకున్నారు. ట్రంప్ మరో మూడు సీట్లు సాధిస్తే.. అధికారికంగా విజయం సొంతం అవుతుంది.
- పెన్సిల్వేనియాలో ట్రంప్ ఘన విజయం
-ఆ రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు కైవసం
-267కి పెరిగిన రిపబ్లికన్ల సంఖ్యా
-మూడు సీట్ల దూరంలోనే అధ్యక్ష పీఠం
- ఎలక్షన్ నైట్ లో ఆలింగనాలు, ఫోన్లతో బిజీగా గడుపుతున్న నేతలు
-గెంతులేస్తూ మెగా టోపీలను విసురుతూ సందడి
-వెస్ట్ పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్ క్యూ కడుతున్న గెస్టులు
ప్రసంగాన్ని రద్దు చేసుకున్న కమలా హారిస్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ల మధ్య, వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోవార్డ్ విశ్వవిద్యాలయంలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు.అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ :
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నట్టు అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ఆయన దేశానికి 47వ రాష్ట్రపతి కానున్నారు.ఎవరికి ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి?
ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు 248 ఎలక్టోరల్ ఓట్లు, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.
America Elections Results 2024 Live News: ఓటమి దిశగా పయణిస్తుండడంతో కమలా హారిస్ హోవార్డ్ యూనివర్శిటీలో తన ప్రసంగాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు.
America Elections Results 2024 Live News: అమెరికా అధ్యక్ష ఎన్నికల రిజల్ట్స్‌తోపాటు హౌస్ ఆఫ్ రిప్రంజటేటివ్స్ ఎన్నికల ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. ఆయన రిపబ్లికన్ అభ్యర్థి క్లాన్‌పై విజయం సాధించారు.
US Elections Results 2024 Live Updates: డొనాల్డ్ ట్రంప్ మళ్లీ జోరు పెంచారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 247 సీట్లతో దూసుకుపోతున్నారు. కమలా హారిస్ 210 సీట్లు గెలుపొందారు.
US Elections Results 2024 Live Updates: అమెరికా ఎన్నికల్లో తొలిసారి లింగమార్పిడి వ్యక్తి విజయం సాధించారు. డెలావేర్ రాష్ట్ర సెనేటర్‌గా సారా మెక్‌బ్రైడ్ గెలుపొందారు. అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన మొట్టమొదటి లింగమార్పిడి రాజకీయవేత్తగా నిలిచారు.
US Elections Results 2024 Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు 39 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ట్రంప్ 24 రాష్ట్రాల్లో ఆధిక్యంలో నిలవగా.. కమలా హారీస్ 16 రాష్ట్రాల్లో ఆధిక్యం కనబరిచారు. ఫలితాల్లో నెవాడా రాష్ట్రం కీలకం కానుంది.
US Elections Results 2024 Live Updates: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ 230 సీట్లతో ఆధిక్యంలో ఉండగా.. కమలా హారిస్‌కు 210 సీట్లతో పుంజుకుంటున్నారు.
US Elections Results 2024 Live Updates: కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లోని డెమొక్రాట్ రో ఖన్నా విజయం సాధించారు.
US Elections Results 2024 Live Updates: కమలా హారిస్ హవాయి రాష్ట్రంలోని నాలుగు ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నారు.
US President Elections Results Live: స్వింగ్ స్టేట్స్‌లో డొనాల్డ్ ట్రంప్ హవా
==> నార్త్ కరోలినాలో ట్రంప్ విజయం
==> జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్..
==> మిషిగన్, అరిజోనాలో ట్రంప్ లీడింగ్
==> నెవాడాలో ప్రారంభంకావాల్సి ఉన్న కౌంటింగ్
==> పెన్సిల్వేనియాలో లక్ష ఓట్ల లీడింగ్‌లో ట్రంప్
==> అరిజోనాలో టఫ్ ఫైట్ ఇస్తున్న కమలాహారిస్US President Elections Results Live: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో కమలా హారీస్ పుంజుకుంటున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 230 సీట్లను ట్రంప్ సొంతం చేసుకోగా.. కమలా హరీస్ 205 సీట్లలో విజయం సాధించారు.
కమల డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియలో గెలిచింది
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (డీసీ) నుంచి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ విజయం సాధించారు. హారిస్ రాజధానిలో మూడు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సాధించారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో హారిస్ విజయం సాధించడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఇది చాలా కాలంగా డెమోక్రటిక్ పార్టీ కోటగా ఉంది.ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?
ఎలక్టోరల్ కాలేజ్ అనేది 538 మంది సభ్యులతో కూడిన సంస్థ. ఇది అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. US రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలకు మరింత అధికారాన్ని ఇవ్వడానికి, కాంగ్రెస్ విజేతను నిర్ణయించకుండా నిరోధించడానికి ఒక రాజీగా దీనిని స్థాపించారు. ప్రతి రాష్ట్రంలోని ఓటర్లు ఆ రాష్ట్రంలో పాపులర్ ఓటుతో గెలిచిన అభ్యర్థికి ఓటు వేస్తారు.రాజా కృష్ణమూర్తి మళ్లీ గెలుపొందారు:
ఇల్లినాయిస్ నుంచి డెమోక్రటిక్ పార్టీ నేత రాజా కృష్ణమూర్తి మరోసారి విజయం సాధించారు. కృష్ణమూర్తి తొలిసారిగా 2016లో కాంగ్రెస్ (యుఎస్ పార్లమెంట్)కి ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నుండి US ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు.ట్రంప్‌కి ఇప్పటివరకు 198 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి:
మంగళవారం జరిగిన ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పటివరకు 198 ఎలక్టోరల్ ఓట్లు రాగా, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌కు 112 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.డొనాల్డ్ ట్రంప్ 20, కమలా హారిస్ 11 రాష్ట్రాలు
అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటి వరకు 20 రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయపథంలో దూసుకుపోతున్నారు. అదే సమయంలో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు.
US President Elections Results Live: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఆయన 188 ఎలక్టోరల్ సీట్లతో మొత్తం 18 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. కమలా హారిస్ 9 రాష్ట్రాలను సొంతం చేసుకోగా.. 99 సీట్లు లభించాయి.
కెంటకీ నుంచి డొనాల్డ్ ట్రంప్, వెర్మోంట్ నుంచి కమలా హారిస్ గెలుపు:
అసోసియేటెడ్ ప్రెస్ అంచనాల ప్రకారం, 1988లో అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ను చివరిగా ఎన్నుకున్న రాష్ట్రంలో మూడు ఎలక్టోరల్ ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ వెర్మోంట్‌ను గెలుపొందారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కెంటకీ నుండి గెలుపొందగా, ఇక్కడ నుండి 8 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇది ఘనమైన రిపబ్లికన్ రాష్ట్రం. ట్రంప్ 2020లో కెంటకీని 25 శాతం కంటే ఎక్కువ పాయింట్లతో తీసుకెళ్లారు.
అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?
US పార్లమెంట్‌లోని మొత్తం సీట్ల సంఖ్య 535, ఇందులో 435 మంది ప్రతినిధుల సభ (HOR) సభ్యులు, 100 మంది సెనేట్ సభ్యులు. భారతదేశంలో లోక్‌సభ ఉన్నట్లే, అమెరికాలో కూడా (ప్రతినిధుల సభ) ఉంది. మన దేశంలో రాజ్యసభ ఉన్నట్లే సెనేట్ కూడా ఉంది. ప్రతి రాష్ట్రం దాని జనాభా ప్రకారం కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రతినిధుల సభను కలిగి ఉంటుంది. అయితే ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు సెనేటర్లు మాత్రమే ఉంటారు. అంటే ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రం నుంచి కనీసం మూడు ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి.అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే, అభ్యర్థులు మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్ల మెజారిటీ సాధించాలి.అమెరికాలోని 7 రాష్ట్రాల్లో ఓటింగ్‌లో ఎవరు ముందంజలో ఉన్నారు?
అమెరికాలో 4 రాష్ట్రాల్లో ఓటింగ్‌లో కమలా హారిస్ ముందంజలో ఉన్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్ 3 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, కమలా హారిస్ పెన్సిల్వేనియా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్‌లలో ముందంజలో ఉన్నారు. అరిజోనా, జార్జియా, నార్త్ కరోలినాలలో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు.డెమాక్రటిక్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఇవే..( కమలా హారిస్ కు మద్దతుగా ఉండే స్టేట్స్):
కాలిఫోర్నియా, మైనే, ఒరెగాన్, కొలరాడో, మేరీల్యాండ్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, మసాచుసెట్స్, వెర్మోంట్, డెలావేర్, న్యూ హాంప్‌షైర్, వర్జీనియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, న్యూజెర్సీ, వాషింగ్టన్, హవాయి, న్యూ మెక్సికో, ఇల్లినాయిస్, న్యూయార్క్రిపబ్లికన్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఇవే..( ట్రంప్ కు అనుకూలంగా ఉండే స్టేట్స్):
అలబామా, కాన్సాస్, నెబ్రాస్కా, టెక్సాస్, అలాస్కా, కెంటుకీ, ఉత్తర డకోటా, ఉటా, అర్కాన్సాస్, లూసియానా, ఓక్లహోమా, వెస్ట్ వర్జీనియా, ఇదాహో, మిస్సిస్సిప్పి, దక్షిణ కెరొలిన, వ్యోమింగ్, ఇండియానా, మిస్సౌరీ, సౌత్ డకోటా, అయోవా, మోంటానా, టేనస్సీగెలుపు ఓటములను నిర్ణయించే స్వింగ్ స్టేట్స్ ఇవే..
అరిజోనా (11 ఎలక్టోరల్ ఓట్లు), జార్జియా (16), మిచిగాన్ (16), పెన్సిల్వేనియా (20), విస్కాన్సిన్ (10), నెవాడా (6), నార్త్ కరోలినా (15), మిన్నెసోటా (10) వంటి రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్ అంటారు. ఇవి కొన్ని సార్లు రిపబ్లికన్లు, మరికొన్ని సార్లు డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నాయి.
రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ నామినీ JD వాన్స్ ఆయన కుటుంబ సభ్యులు ఒహియోలో తమ ఓట్లను వేశారు. రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ నామినీ జెడి వాన్స్ సిన్సినాటిలోని ఓటు వేశారు. అంతకు ముందు వాన్స్ తన భార్య ఉష ఇంకా వారి పిల్లలతో కలిసి సెయింట్ ఆంథోనీ ఆఫ్ పాడువా చర్చ్ ను సందర్శించారు.
40 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఓటింగ్..
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాతో సహా ప్రసుత్తం 40 రాష్ట్రాలలో పోలింగ్ ప్రారంభం అయ్యింది. నార్త్ కరోలినా, జార్జియా, పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా రాష్ట్రాల్లో హోరా హోరీ పోరు జరగనుంది. ఈ రాష్ట్రాలు గెలుపు ఓటములను నిర్ణయించనున్నాయి.
ఆర్కాన్సాస్ రాష్ట్రంలో ఓటింగ్ ప్రారంభమైంది, ఎన్నికలు ప్రారంభం అయిన మొత్తం US రాష్ట్రాల సంఖ్య దాదాపు 30కి పెరిగింది. ఆర్కాన్సాస్‌లో ఆరు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. అయితే అత్యధికంగా కాలిఫోర్నియాలో 54, న్యూయార్క్‌లో 28 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి:
తలుపులు తట్టండి.. ఓటర్లను పిలవండి.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని ఆమె ఎక్స్‌లో పోస్టు షేర్ చేశారు.రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
US అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నవంబర్ 5న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు పోలింగ్ స్టేషన్లలో జరుగుతుంది. భారతదేశంలోని టైమింగ్ ప్రకారం, ఇది నవంబర్ 5 సాయంత్రం 4:30 నుండి నవంబర్ 6 ఉదయం 6:30 వరకు ఉంటుంది.
వాషింగ్టన్ DCలో ఓటింగ్ కొనసాగుతోంది
కెనడా సరిహద్దుకు ఆనుకుని ఉన్న న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాచ్‌లో కౌంటింగ్ ప్రారంభమైంది. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌లకు ఇప్పటి వరకు మూడేసి ఓట్లు వచ్చాయి. డిక్స్‌విల్లే నాచ్‌లోని స్థానిక ప్రజలు 2020లో జో బిడెన్‌ను గెలిపించేలా ఏకగ్రీవంగా ఓటు వేశారు.
US అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నవంబర్ 5న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు పోలింగ్ స్టేషన్లలో జరుగుతుంది. భారతదేశంలోని టైమింగ్ ప్రకారం, ఇది నవంబర్ 5 సాయంత్రం 4:30 నుండి నవంబర్ 6 ఉదయం 6:30 వరకు ఉంటుంది.
అమెరికాలోని కనెక్టికట్, న్యూజెర్సీ, న్యూయార్క్, న్యూ హాంప్‌షైర్, వర్జీనియాలో ఓటింగ్ ప్రారంభమైంది. ఇండియానా, కెంటుకీలలో కూడా ఓటింగ్ ప్రారంభమైంది.