ఊరందరిదీ  ఓ దారైతే..ఉలిపికట్టది ఓ దారి అంటారు. ఈ సామెత పాకిస్తాన్ కు సరిగ్గా సరిపోతుంది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో  చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అందులో పాకిస్తాన్ కూడా ఒకటి. భారత దేశంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. అక్కడక్కడ పోలీసులకు, పౌరులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నా.. పెద్దగా ఆందోళనకర పరిస్థితి లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ పాకిస్తాన్ లో ఇందుకు  పరిస్థితి భిన్నంగా ఉంది. పాకిస్తాన్ లోని కరాచీలో పోలీసులపై పౌరులు తిరగబడ్డారు. లాక్ డౌన్ వేళ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు నెత్తీనోరు మొత్తుకుని చెబుతుంటే పట్టించుకోకుండా .. వారిపైనే తిరగబడడం విశేషం. అంతే కాదు ఏకంగా గుంపులు గుంపులుగా గుమిగూడి  కరాచీ పోలీసులను తరిమితరిమి కొట్టారు.  వారిపైకి రాళ్లు రువ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.



ఈ వీడియో కరాచీలోని లిఖాతాబాద్  కు సంబంధించినది. ఇక్కడ స్థానికులు పోలీసు వ్యానుపై ఎలా రాళ్లు రువ్వుతున్నారో గమనించవచ్చు. లాక్ డౌన్ పాటించకుండా వేలాదిగా బయటకు వచ్చిన స్థానికులు .. పోలీసులను పరుగెత్తించి పరుగెత్తించి మరీ కొట్టారు. ఇలాంటి  ఘటనల వల్ల కరోనా వైరస్ పాకిస్తాన్ లో విజృంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..