Mahatma Gandhi statue: అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని (Mahatma Gandhi Statue) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.  న్యూయార్క్‌ నగరంలోని (New York City) మాన్‌హాటన్ యూనియన్ స్క్వేర్‌లోని 8 అడుగుల గాంధీ కాంస్య విగ్రహాన్ని శనివారం దుండగులు ధ్వంసం చేశారు. ఈ చర్యను భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India) తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాత్మా గాంధీ 117వ జయంతి (Gandhi 117th birth anniversary) సందర్భంగా ఈ విగ్రహాన్ని న్యూయార్క్‌లో 1986, అక్టోబర్‌2న ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని  గాంధీ మెమోరియల్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చింది, అయితే 2001లో కొన్ని కారణాలతో ఈ విగ్రహాన్ని తొలగించగా మళ్లీ 2002లో పునరుర్ధరించారు. గాంధీ విగ్రహంపై దాడిని ఇక్కడ భారతీయ-అమెరికన్లు ఖండించారు. 


అమెరికాలో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని ఓ పార్కులో ఉన్న విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. డిసెంబర్ 2020లో జరిగిన మరో సంఘటనలో.. ఖలిస్తానీ-మద్దతుదారులు వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ చర్యను అప్పటి వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ 'భయంకరమైనది'గా అభివర్ణించారు.


Also read: US Covid-19: అమెరికాలో కరోనా మరణ మృదంగం..9 లక్షలు దాటిన మరణాలు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి