Omicron Variant: భయపెడుతున్న ఒమిక్రాన్ డబ్లింగ్ రేటు, అమెరికాలో లాక్‌డౌన్‌పై నిర్ణయం
Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి వెలుగుచూస్తున్న అంశాలు భయపెడుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే అత్యధిక వేగంతో సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు ఎంత ఉందంటే..
Omicron Variant: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి వెలుగుచూస్తున్న అంశాలు భయపెడుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే అత్యధిక వేగంతో సంక్రమిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు ఎంత ఉందంటే..
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఒక్కొక్క దేశాన్ని చుడుతూ..75 దేశాలకు వ్యాపించింది. ఇండియాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. మొన్నటి వరకూ ప్రపంచాన్ని భయపెట్టిన డెల్టా వేరియంట్ కంటే అత్యధిక వేగంతో ఒమిక్రాన్ సంక్రమిస్తోందని తేలింది. యూకేలో పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అటు అమెరికాలో అయితే 36 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant Doubling Rate)కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని సీడీసీ ఒమిక్రాన్ సంక్రమణ, జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణను అందించింది. ఈ నివేదిక మరింత ఆందోళన రేపుతోంది.
ఒమిక్రాన్ వ్యాప్తి..డెల్టా వేరియంట్(Delta Variant)కంటే అధికంగా ఉందని సీడీసీ నివేదిక(CDC Report) తెలిపింది. అంతేకాకుండా ఒమిక్రాన్ డబ్లింగ్ రేటు చాలా ఎక్కుగా ఉందని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ డబ్లింగ్ రేటు అంటే రెట్టింపు అయ్యే సమయం కేవలం రెండ్రోజులేనని చెబుతోంది. డెల్టా వేరియంట్ డబ్లింగ్ రేటు వివిధ దశల్లో 3-5 రోజుల వరకూ ఉండేది. ఒమిక్రాన్ డబ్లింగ్ రేటు మాత్రం ఇప్పుడే రెండ్రోజులుగా ఉంది. ఈ సమయం మరింత తగ్గవచ్చనే అంచనా ఉంది. ఓ వైపు డెల్టా వేరియంట్ కూడా విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపధ్యంలో వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో లాక్‌డౌన్(America On Lockdown)పెట్టాల్సిన అవసరం లేదని..వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దేశంలోని ఆసుపత్రులు ఒమిక్రాన్ కేసులతో నిండిపోతున్నాయి. విద్యాసంస్థలు మరోసారి ఆన్‌లైన్ క్లాసులకు ఛేంజ్ అవుతున్నాయి. కోవిడ్ ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా..విద్యాసంస్థలు స్వచ్ఛంధంగా ఆన్‌లైన్(Online Classes)నిర్ణయం తీసుకుంటున్నాయి.
Also read: Plane crash: ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా కూలిన విమానం- 9 మంది మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook