Plane crash: ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేస్తుండగా కూలిన విమానం- 9 మంది మృతి!

Plane crash: ఓ ప్రైవేట్​ ఎయిర్​క్రాఫ్ట్​​ కూలిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది సహా మొత్తం 9 మంది మృతి చెందారు. ప్రమాదం ఎక్కడ జరిగింది.. ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 08:12 AM IST
  • డొమినికన్​ రిపబ్లిక్​లో విమాన ప్రమాదం
  • తొమ్మిది మంది దుర్మరణం
  • ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా దుర్ఘటన
Plane crash: ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేస్తుండగా కూలిన విమానం- 9 మంది మృతి!

Plane crash: డొమినికన్​ రిపబ్లిక్​ రాజధాని సాంటో డొమినిగోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నగరంలో ఉన్న లాస్ అమెరికాస్​ ఎయిర్​పోర్ట్​లో ఓ ప్రైవేటు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​ చేస్తుండగా (Private Jet Crashes in Dominican Republic) కుప్పకూలింది.

ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రైవేటు జెట్​ నిర్వహణ సంస్థ హెలిడోసా ఏవియేషన్​ గ్రూప్​ (Helidosa Aviation Group
) అధికారికంగా ధృవీకరించింది. డొమినికన్​ రిపబ్లిక్ కాలమానం ప్రకారం.. బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాద సమయంలో విమానంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిపింది హెలిడోసా ఏవియేషన్​. ప్రయాణికుల్లో ఆరు మంది విదేశీయులు కాగా.. ఒకరు డొమినికన్​ దేశానికి చెందినవారని పేర్కొంది. అయితే మృతుల వివరాలు.. ఏ దేశానికి చెందినవారు అనే విషయాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే..

ప్రమాదానికి గురైన ఎయిర్​క్రాఫ్ట్​.. లా ఇసాబెలా ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ఫ్లోరిడా వెళ్లాల్సి ఉందని తెలిపారు స్థానిక అధికారులు. అయితే సాంకేతిక కారణాల వల్ల విమానాన్ని అత్యవసర ల్యాండిగ్​ చేస్తుండగా.. విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు వివరించారు.

ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు హెలిడోసా ఏవియేషన్​ గ్రూప్ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొంది.

Also read: World Omicron Alert: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్

Also read: Dubai: ప్రపంచంలో తొలి కాగిత రహిత ప్రభుత్వంగా దుబాయ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News