భారీ భూకంపం ( Major Earthquake ) , సునామీ ( Tsunami ) టర్కీ ( Turkey ) లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విషాదాన్ని కళ్లకు కట్టే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అపార్ట్మెంట్ నిట్టనిలువునా కూలిపోయిన దృశ్యం గానీ...రాకాసి అలలు ఇజ్మీర్ పట్టణాన్ని ముంచెత్తిన తీరు గానీ…


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గ్రీక్ ( Greece ) దేశాల్ని భూకంపం కకావికలం చేసింది. రిక్టర్ స్కేల్ ( Richter scale ) పై 7.0 గా నమోదైన భూ ప్రకంపనలు భారీగా విషాదాన్ని మిగిల్చాయి. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్ ల మధ్య ఏజియన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను..ముఖ్యంగా ఇజ్మీర్ ( Izmir ) నగరాన్ని ముంచెత్తాయి. ఈ విషాదాన్ని కళ్లకు కట్టే వీడియోలు వైరల్ అవుతున్నాయి. సునామీ కారణంగా రాకాసి అలలు ముంచెత్తిన తీరు గానీ...అపార్ట్ మెంట్ నిట్టనిలువుగా కూలిపోవడం గానీ...షాకింగ్ గా ఉన్నాయి. టర్కీ ఏజియన్ సిటీ ఇజ్మీర్ లో భారీ నష్టం వాటిల్లింది. 30 లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరంలో పెద్దఎత్తున ఇళ్లు కూలిపోయాయి. 


అపార్ట్ మెంట్ నిట్టనిలువునా కూలిపోయిన దృశ్యం




రెస్టారెంట్ లో భయం గొలిపే భూకంపం దృశ్యాలు



 


సీసీటీవీ‌ వీడియోలో భూకంపం ధాటికి ఓ రెస్టారెంట్‌ కంపించడం.. సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయడం..ఇజ్మీర్‌ సమీపంలోని ఓ పట్టణంలోకి సముద్రపు రాకాసి అలలు దూసుకురావడం, అపార్ట్ మెంట్ నిట్టనిలువునా కూలిపోవడం భయం గొలుపుతున్నాయి.



ఇప్పటివరకూ 17 మందికి పైగా మరణించగా..వందలాది మందికి గాయాలయ్యాయి. బహుళ అంతస్థుల భవనాలు అధికసంఖ్యలో కూలిపోయాయి. ఎటు తప్పించుకోడానికి వీలు లేకుండా అతలాకుతలం చేసేసింది. Also read: Turkey Earthquake: 17కి చేరిన మృతుల సంఖ్య.. వందలాది మందికి గాయాలు