Rare and Strange Medical Condition: హస్త ప్రయోగం కారణంగా ఓ యువకుడు ఆసుపత్రిపాలయ్యాడు. బలంగా హస్త ప్రయోగం చేయడంతో అతని ఊపిరితిత్తులపై ఆ ప్రభావం పడింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు. స్విట్టర్లాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇటీవల ప్రచురితమైన 'రేడియాలజీ కేస్ రిపోర్ట్స్' జర్నల్ ద్వారా వెలుగుచూసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రిపోర్ట్ ప్రకారం... అతను బెడ్‌పై పడుకుని ఆ పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పటికే అతని ముఖంపై వాపుతో పాటు అతను శ్వాస తీసుకునేటప్పుడు లోపలి నుంచి శబ్ధాలు రావడం గమనించారు.


ఎక్స్‌రే స్కానింగ్ రిపోర్ట్‌లో అతను 'న్యుమోమెడియాస్టినమ్' అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. హస్త ప్రయోగం సమయంలో ఊపిరితిత్తులపై ఆ ఎఫెక్ట్ పడటంతో ఊపిరితిత్తుల్లో నుంచి గాలి బయటకు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. దానివల్లే అతను శ్వాస తీసుకునే సమయంలో శబ్దాలు వస్తున్నట్లు నిర్ధారించారు. ఇది చాలా నొప్పితో కూడుకున్నది అని... అయితే దీనివల్ల ప్రాణాపాయం ఏమీ ఉండదని వైద్యులు తెలిపారు. 


సాధారణంగా 20ల్లో ఉన్న యువకుల్లో అరుదుగా ఇలాంటి సమస్య తలెత్తుతుందని పేర్కొన్నారు. తాజా కేసులో సదరు పేషెంట్‌కు ఆస్తమాకు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఊపిరితిత్తులు దెబ్బతిన్న కారణంగా అతనికి హై డోస్ ఆక్సిజన్ అందిస్తున్నట్లు వెల్లడించారు.


Also Read: Prashant Kishor: టార్గెట్ 2024... కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్...? పార్టీకి పునర్వైభవం కోసం పీకే రోడ్ మ్యాప్..! 


Prabhas Fined: ఆ కారు ప్రభాస్‌ది కాదు... క్లారిటీ ఇచ్చిన రెబల్ స్టార్ పీఆర్ టీమ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook