Prashant Kishor meets Sonia Gandhi: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను తమ పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. బయట నుంచి సేవలందించడం కన్నా పార్టీలో చేరితే కాంగ్రెస్ బలోపేతానికి మరింత కృషి చేయవచ్చునని సోనియా పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సోనియా ప్రతిపాదనకు ప్రశాంత్ కిశోర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరిక ఇక ఖాయమేనన్న ప్రచారం జోరందుకుంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్ర నేత రాహుల్‌తో పాటు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో ప్రశాంత్ కిశోర్ శనివారం (ఏప్రిల్ 16) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమయ్యే వ్యూహాలపై చర్చించారు. 370 సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను తన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలో దిగాలని, బీహార్, ఒడిశా, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్రల్లో పొత్తులు పెట్టుకోవాలని ప్రజెంటేషన్‌లో పీకే పేర్కొన్నట్లు తెలుస్తోంది. పీకే ఇచ్చిన సలహాలు, సూచనల అమలులో సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించబోతున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ వెల్లడించారు.
పీకే కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అవడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ ఆయన పలుమార్లు కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత గెలుపు తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అగ్ర నేత రాహుల్‌లతో సమావేశమయ్యారు. అప్పుడే ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలో చేరాల్సిందిగా కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను కోరారు. దీంతో పీకే కాంగ్రెస్ చేరికపై అప్పటి నుంచే చర్చ జరుగుతోంది. తాజా సమావేశంలో మరోసారి పీకే ముందు ఈ ప్రతిపాదన పెట్టడంతో ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Delhi Violence: దేశ రాజధానిలో మరోసారి హింస, హనుమాన్ జయంతి ర్యాలీలో ఇరువర్గాల ఘర్షణ
RCB vs DC: ఢిల్లీ కొంపముంచిన 18వ ఓవర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook