Taiwan Earthquake: భారీ భూకంపం తైవాన్ ద్వీపాన్ని గజగజ వణికించేసింది. వందలాదిగా పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. జపాన్ దక్షిణ ద్వీపం ఒకినావాకు, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే సునామీ కెరటాలు తాకుతున్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తైవాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున తైవాన్ రాజధాని తైపీలో రిక్టర్ స్కేలుపై ఏకంగా 7.4 తీవ్రత నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. హువాలియన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో కేవలం 34.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. తైవాన్ చరిత్రలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపంగా భావిస్తున్నారు. భూకంపం కారణంగా జపాన్ దక్షిణ ద్వీపమైన ఒకినావాకు,స ఫిలిప్పీన్‌కు దాదాపు 10 అడుగుల మేర సునామీ కెరటాలు విధ్వంసం సృష్టించవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయు. ఇప్పటికే మియాకో, యాయామా దీవుల్ని సునామీ కెరటాలు తాకినట్టు తెలుస్తోంది. 


భూకంపం ధాటికి తైవాన్‌లో పలు భారీ భవనాలు నేలకూలగా మరి కొన్ని భవనాల పునాదులు కదిలిపోయాయి. స్పీడ్ రైలు సర్వీసులు నిలిపివేశారు. విమానాలు రద్దయ్యాయి. జనం అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. భూకంప కేంద్రం పసిఫిక్ మహా సముద్రంలో 15.5 కిలోమీటర్ల లోతులో ఉన్నందున సునామీ హెచ్చరిక జారీ చేశారు. తైవాన్ ఈశాన్య ప్రాంతంలోని ఇలాన్ కౌంటీ, మియాలీ కౌంటీలో 5 ప్లస్ హెచ్చరిక జారీ అయింది. అటు తైపీ సిటీ, న్యూ తైపీ సిటీ, టాయువాన్ సిటీ, హ్సించు సిటీ, తైచుంగ్ నగరాల్లో కూడా ఇదే స్థాయి హెచ్చరిక జారీ అయింది. స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని అదికారులు కోరారు.



భారీగా ప్రాణ, ఆస్థి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా. కానీ ఇంకా వివరాలు తెలియలేదు. 1999లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 2400 మంది మృత్యువాత పడ్డారు. కొన్ని భవనాలు ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అందులో ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. 


Also read: NASA CADRE Mission: నాసా నుంచి సూట్‌కేస్ సైజులో బుల్లి రోవర్, వచ్చే ఏడాది చంద్రునిపై



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook