Moscow Gun Firing: రష్యా రాజధాని నగరం మాస్కోలో మారణహోమం సంభవించింది. మిలిటరీ దుస్తుల్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో చొరబడిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు మొదలెట్టారు. ఊహించని ఈ ఘటనతో జనం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం మార్చ్ 22వ తేదీ సాయంత్రం మాస్కో నగర శివార్లలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్‌నిక్ షో జరగనుంది. మరి కాస్సేపట్లో షో మొదలౌతుందనగా ఒక్కసారిగా కొందరు దుండగులు మిలిటరీ వేషదారణలో చొచ్చుకొచ్చారు. ఒక్కసారిగా ఫైరింగ్ ఓపెన్ చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న నగర వాతావరణం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. మొత్తం ఐదుగురు సాయుధులు మెషీన్ గన్లతో కాల్పులు జరిపారు. ప్రాణాలు రక్షించుకునేందుకు జనం పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంగణమంతా మంటలు, పొగలతో కమ్ముకుపోయింది. 40 మంది ప్రాణాలు కోల్పోగా వందలాదిమందికి గాయాలయ్యాయి. చాలామంది మంటల్లో చిక్కుకున్నారు. 


ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రషన్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రంగంలో దిగాయి. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. మంటల్లో చిక్కుకున్నవారికిని కాపాడేందుకు హెలీకాప్టర్లు ఉపయోగించారు. దాడికు కారణం ఎవరనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ దాడికి ఉక్రెయిన్ దేశానికి సంబంధం లేదని అమెరికా ఖంఢించడం విశేషం. ఈ దాడుల్ని సాకుగా ఉపయోగించుకుని రష్యా దురాక్రమణలు దాడులు చేస్తుందని ఉక్రోయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. 


మరోవైపు ఈ దాడులకు తామే బాధ్యులమంటూ ఉగ్ర సంస్థ ఐసిస్ ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. దాడి తామే చేసినట్టుగా ఐసిస్ నోట్ పంపినట్టు తెలుస్తోంది. కానీ దీనికి ఆధారాల్లేవు. ఈ తరహా దాడులు జరిగే అవకాశముందని అమెరికా రష్యాను ముందే హెచ్చరించడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తమ దేశంలో ఉగ్రదాడుల సమాచారం అమెరికాకు ముందే ఎలా తెలిసిందనే అనుమానాలు వస్తున్నాయి. 


ఈ దాడుల నేపధ్యం 2008లో ముంబైలో జరిగిన  26/11 కాల్పుల్ని గుర్తు చేస్తోంది. అప్పుడు కూడా నగరంలోని ప్రముఖ హోటల్స్, రైల్వే స్టేషన్, ఆసుపత్రుల్ని ఉగ్రమూకలు టార్గెట్ చేశాయి.


Also read Putin Win: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ సంచలన విజయం... 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook