Mexico Train Accident: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 1000 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది!
Mexico Fire Accident, Train Hits Fuel Truck In Mexico. మెక్సికో అగ్వాస్కాలియెంటెస్ నగరంలోని రైలు మార్గం వద్ద ఇంధన ట్యాంకర్ ట్రక్కును ట్రైన్ ఢీకొట్టింది.
Mexico Fire Accident, Train Hits Fuel Truck In Mexico: సెంట్రల్ మెక్సికోలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ ట్రక్కు రైలు మార్గంను దాటుతుండగా ట్రైన్ ఢీకొట్టింది. దాంతో ట్రక్కులో భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కమ్మేసింది. ఈ ప్రమాదంలో పక్కన ఉన్న ఇళ్లు కాలిపోయాయి. ప్రాణ భయంతో ప్రజలు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
అగ్వాస్కాలియెంటెస్ నగరంలోని రైలు మార్గం వద్ద ఇంధన ట్యాంకర్ ట్రక్కును ట్రైన్ ఢీకొట్టింది. ట్రక్కు ఓవర్ పాస్ అవుతుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో సమీపంలోని నివాస ప్రాంతాలకు మంటలు అంటుకున్నాయి. దాంతో 800 నుంచి 1000 మందిని ఇళ్లలోంచి ఖాళీ చేయించినట్లు అగ్వాస్కాలియెంటెస్ ఫైర్ చీఫ్ మిగ్యుల్ మురిల్లో తెలిపారు.
మంటల్లో చిక్కుకున్న పన్నెండు మంది వ్యక్తులను ఫైర్ సిబ్బంది రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే దట్టమైన పొగ కారణంగా ఒక వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. కార్గో రైలు మంటలను ఆర్పేసింది. మరోవైపు సంఘటన స్థలంలో ఉన్న వాహనాల్లోని ప్రజలు తమ పిల్లలను తీసుకొని బయటికి పరుగెత్తారు. ఈ ప్రమాదంకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read: IND vs PAK: తుది జట్టులో పంత్, కార్తీక్.. పాక్ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత్ టీమ్ ఇదే!
Also Read: PM Modi: కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook