Microsoft: తెలుగు తేజానికి మరో ఘనత దక్కింది. ప్రపంచ సుప్రసిద్ధ కంపెనీలో సర్వోన్నత స్థానం దక్కింది. భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల సాధించిన మరో ఘనత ఇది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచంలోని సుప్రసిద్ధ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ ,గూగుల్ సంస్థలకు సీఈవోలుగా ఉన్న ఇద్దరూ భారతీయులు కావడం..అందులో తెలుగువారు కావడం విశేషం. మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ సంస్థ సీఈవోగా సుందర్ పిచ్చాయ్‌లు(Sunder Pichai) ఉన్నారు. ఇప్పుడు టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మరో అరుదైన గౌరవం లభించింది. సీఈవో స్థాయి నుంచి కంపెనీ సర్వోన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. సత్య నాదెళ్ల (Satya Nadella) కంపెనీ ఛైర్మన్‌గా (Satya Nadella as Microsoft Chairman) ఎంపికయ్యారు. 2014లో మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల ప్రాజెక్టు అభివృద్దిలో కీలకపాత్ర పోషించారు.


ప్రస్తుత కంపెనీ ఛైర్మన్ జాన్ థామ్సన్ స్థానంలో సత్య నాదెళ్ల (Satya Nadella) బాధ్యతలు తీసుకోనున్నారు. థామ్సన్ ఇకపై లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. స్టీవ్ బాల్‌మెర్ నుంచి 2014లో కంపెనీ సీఈవోగా బాథ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల..లింక్డ్ ఇన్, న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమాక్స్ సంస్థల కొనుగోళ్లు, ఇతర డీల్స్‌తో సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. దాతృత్వ పనుల నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని సంస్థ వ్యవస్థాపకుడైన బిల్‌గేట్స్ ప్రకటించిన ఏడాది తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల మార్పులు చోటుచేసుకున్నాయి. 


Also read: NATO Summit: చైనాకు వ్యతిరేకంగా నాటో సదస్సులో తీర్మానం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook