TikTok: కొనుగోలు చేయనున్న మైక్రోసాఫ్ట్
ప్రముఖ టిక్ టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్ వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
ప్రముఖ టిక్‌టాక్ యాప్ ( TikTok App ) త్వరలోనే చేతులు మారనుందా. సాఫ్ట్వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ ( Microsoft ) కొనుగోలు చేయనుందా. నిన్నటివరకూ ఇది ఊహాగానాలకు పరిమితమైన వార్త. ఇప్పుడు నిజమే. టిక్ టాక్ కొనుగోలుపై మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటన చేసింది.
చైనా దేశపు టిక్‌టాక్ యాప్ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేేసే అంశంపై టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ తో మైక్రోసాఫ్ట్ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని నేరుగా మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించింది. ఇందులో భాగంగానే యాప్ భద్రతపై వస్తున్న అనుమానాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) తో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ( Microsoft CEO Satya Nadella ) చర్చించారు. కేవలం అమెరికానే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాల్ని కూడా మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయనుంది. బైట్ డాన్స్ తో జరుగుతున్న చర్చలు సెప్టెంబర్ 15 నాటికి పూర్తి కానున్నాయి. Also read: Jammu Kashmir: ప్రపంచపు అతి ఎత్తైన వంతెన త్వరలో పూర్తి
టిక్‌టాక్‌ను పూర్తిగా నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపధ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. యాప్ పనితీరు, భద్రత, కొనుగోలు ఒప్పందపు అంశాలపై ట్రంప్ తో చర్చించినట్టు మైక్రోసాఫ్ట్ వివరించింది.
ఓ వైపు టిక్‌టాక్ యాప్‌ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం, మరోవైపు చైనా యాప్‌లు అమెరికా పౌరుల ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించాయని ఆ దేశపు విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనలు...ఈ నేపధ్యంలో అదే దేశానికి చెందిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆ యాప్ ను కొనుగోలు చేయనుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. Also read: Rakhi: గట్టి దెబ్బే తగిలింది, 4 వేల కోట్ల నష్టం