Mass shooting in Israel's Tel Aviv : ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ఉగ్రవాదులు విరుచుపడ్డారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, ఈ సంఘటన జెరూసలేం స్ట్రీట్‌లో జరిగినట్లు పేర్కొంది.  ఈ ఉగ్రదాడిలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.  ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ "జఫాలో కాల్పుల దాడిలో ఉన్న చాలా మందికి, అపస్మారక స్థితిలో ఉన్న కొంతమందికి" చికిత్స అందిస్తున్నట్లు నివేదించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇద్దరు ముష్కరులతోపాటు పది మంది మరణించినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అటు మధ్యప్రాచ్యం పెను యుద్ధం దిశగా పయనిస్తోంది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇటీవల ఇజ్రాయెల్ హతమార్చిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూమి దాడుల కోసం లెబనాన్‌లోకి ప్రవేశించింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడికి ప్లాన్  చేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇరాన్ నుండి ఇప్పటివరకు సుమారు 102 క్షిపణులను ప్రయోగించారు. ఇరాన్ త్వరలో బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది ఇజ్రాయెల్.


Also Read: Dusshera: నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు దసరా కానుక.. పోలీస్‌ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన


ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని, దేశవ్యాప్తంగా వైమానిక దాడుల సైరన్‌లు మోగుతున్నాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పౌరులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇజ్రాయెల్ ప్రకారం, ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్‌కు చేరుకుంటున్నాయని చాలా వరకు నష్టం సంభవించినట్లు తెలిపాయి. AP నివేదిక ప్రకారం, ఇరాన్ త్వరలో బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌పై నేరుగా సైనిక దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా ఇరాన్‌కు హెచ్చరిక జారీ చేసింది.


పలు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ కూడా ఈ ముప్పుపై ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇరాన్, లెబనాన్, ఇరాక్ లేదా యెమెన్ నుంచి ఎలాంటి దాడి జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ తెలిపింది.ఈ రాత్రికే దాడి జరిగే అవకాశం ఉందన్న వెల్లడించిన కొద్దిసేపటికే ఉగ్రదాడి జరగడం గమనార్హం. 


 



Also Read: Temple Thieves: ఈ దొంగలకు దేవాలయాలు కనిపిస్తే చాలు.. దేవుడికే నిలువు దోపిడీ


 



 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.