Flesh Eating Bacteria: 48 గంటల్లో ప్రాణాలు తీసేస్తున్న వ్యాధి, జపాన్‌లో ఆందోళన
Flesh Eating Bacteria: ప్రపంచాన్ని గుప్పిట బంధించి రెండేళ్లపాటు భయపెట్టిన కరోనా మహమ్మారి తరువాత అంతకంటే భయంకరమైన వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదొక బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్. కేవలం 48 గంటల్లో ప్రాణాలు తీసేస్తుందట. ఆ వివరాలు మీ కోసం.
Flesh Eating Bacteria: కోవిడ్ 19 మహమ్మారి తరువాత జపాన్‌లో ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ భయపెడుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఇన్‌ఫెక్షన్ సోకిందంటే కేవలంల 48 గంటల్లో ప్రాణం పోతుంది. ఈ వ్యాధి లక్షణాలు, ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం.
జపాన్‌లో అత్యంత అరుదైన ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ప్రబలుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ బ్యాక్టీరియా స్పెక్ట్రోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు కారణమౌతుంది. ఇది తక్కువ సమయంలోనే ప్రాణాంతకంగా మారుతుంది. నిపుణుల హెచ్చరిక ప్రకారం ఇన్‌ఫెక్షన్ సోకిన 48 గంటల్లోనే రోగి ప్రాణం పోవచ్చు. ఈ ఏడాది 2024లో జూన్ వరకూ జపాన్‌లో 977 STSS కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 941 కేసులు వెలుగు చూశాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ ప్రకారం ఇదే వేగంతో కేసులు పెరుగుతుంటే ఈ ఏడాదిలో 2500 కేసులకు చేరుకోవచ్చు. ఇక మరణాలరేటు 30 శాతంగా ఉంది. కోవిడ్ 19 మహమ్మారి ఉన్నప్పుడు విధించిన నిబంధనలు సడలించిన తరువాత జపాన్‌లో ఈ పరిస్థితి ఎదురైంది.
ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
ఈ ఇన్‌ఫెక్షన్ సోకితే ప్రారంభంలో ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఇందులో జ్వరం, కండరాల నొప్పి, గొంతులో గరగర ఉంటాయి. ఆ తరువాత లక్షణాలు తీవ్రౌతాయి. తీవ్రమైన జ్వరం, బ్లడ్ ప్రెషర్ పడిపోవడం, చర్మం ఎర్రగా మారడం వంటివి కన్పిస్తాయి. ఇప్పటివరకైతే ఈ బ్యాక్టీరియా గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు. దీన్నించి కాపాడుకునేందుకు చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, ఏదైనా గాయమైతే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకోవడం చాలా అవసరం. ఇంకా ఇతర లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also read: IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook