Srilanka Clashes: ద్వీపదేశం శ్రీలంకలో ఆర్థికసంక్షోభం హింసాత్మకంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ మరింత దిగజారుతున్నాయి. దీంతో అధికారపార్టీపై తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు ప్రజలు . అధ్యక్షుడితో పాటు ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాందోళనలకు దిగొచ్చి పదవికి రాజీనామా చేశారు ప్రధాని మహేంద్ర రాజపక్సె. ఈ సందర్భంగా జరిగిన ఘటనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. కొలంబోతో పాటు ఇతర ప్రాంతాల్లో రాజపక్సే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనలు అణచివేయడానికి కొలంబోలో తక్షణ కర్ఫ్యూ ప్రకటించారు. వీధులన్నీ ఆర్మీ ఆధీనంలోకి తీసుకుంది. అయినా అక్కడ ఉద్రిక్తతలు మాత్రం తగ్గడంలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక రాజధాని కొలంబో వెలుపల జరిగిన ఆందోళనల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీ చనిపోయారు. నిట్టంబూవాలో తన కారును అడ్డగించిన ఆగంతకులపై కాల్పులు జరిపారు ఎంపీ అమరకీర్తి అత్కోరాలా. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి సమీప భవనంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నించారు. అయితే ఈ సందర్భంగా జరిగిన గొడవల్లో ఎంపీ అమరకీర్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 


ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి ప్రధాని మహేంద్ర రాజపక్సే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను అధ్యక్షుడు, సోదరుడు అయిన గొటబాయ రాజపక్సేకు పంపారు. ఈ సందర్భంగా ప్రధాని రాజపక్సే అనుకూలురైన వారు కొలంబోలో పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు. ఆర్మీ వారిని నిలువరించే ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. ఘర్షణలు నివారించేందుకు ప్రభుత్వం వెంటనే కొలంబోలో కర్ఫ్యూ ప్రకటించింది. 


కొలంబోలో జరిగిన ఘర్షణల్లో కనీసం వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. అధ్యక్ష కార్యాలయం వెలుపల ఆందోళన చేస్తున్న వారిపైకి రాజపక్సే అనుకూల వర్గం దూసుకెళ్లి దాడిచేసిందని.. దాంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయని అధికారులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో నిత్యావసరాలతో పాటు పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. విదేశీమారక నిల్వలు అడుగంటాయి. భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఎంతో కొంత సాయం చేస్తున్నా అక్కడ పరిస్థితులు మాత్రం కుదుటపడటం లేదు.
 


also read:  Sri lanka PM Resign: మహిందా రాజపక్సే రాజీనామా.. నిరసనలకు దిగివచ్చిన శ్రీలంక ప్రధాని


also read:  Elon Musk: ఇంటర్నెట్‌ సేవలను అందిస్తే చంపేస్తారా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.