Sri lanka PM Resign: శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రజాందోళనలు మిన్నంటిన నేపథ్యంలో పదవి వదులుకోక తప్పలేదు. గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. రాజపక్సే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమంటూ ప్రజాగ్రహం వెల్లువెత్తింది.
సోమవారం కూడా అక్కడ జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధానితో పాటు శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే కూడా పదవి నుంచి దిగిపోవాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. వీరిపై ప్రభుత్వ మద్దతు దారులు దాడులకు దిగడంతో హింస చెలరేగింది. దాంతో కొలంబోలో 25 మంది దాకా గాయపడ్డారు. పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.
దేశంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీలంకలో నిత్యవసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఉప్పు, పప్పు, బియ్యం...ఇలా ఏం చూసినా... ధరలు అందనంతగా
పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. లీటరు పెట్రోల్ ఏకంగా 500 రూపాయలకు చేరింది. లీటర్ పెట్రోల్ కోసం బంక్‌ల వద్ద జనం నిత్యం బారులు తీరే పరిస్థితి. పేపర్ల కొరత అక్కడ పరీక్షలు సైతం వాయిదా వేశారు. ప్రజా రవాణా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
చైనాను గుడ్డిగా నమ్మి శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దేశంలో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయాయి. 51 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించలేమని శ్రీలంక చేతులెత్తేసింది.
దాంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఆహార, ఔషధ, ఇంధన కొరత ఏర్పడింది. ఒక పక్క దేశం అప్పుల ఊబిలో కూరికుపోవడం... మరోపక్క రాజపక్సే ప్రభుత్వ అసమర్థ నిర్ణయాలతో జనం విసిగిపోయారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు శ్రీలంక తీసుకున్న నిర్ణయాలు ఏవీ ఫలించలేదు. ఫలితంగా దేశంలో మునుప్పెన్నడూ చూడని తీవ్ర సంక్షోభాన్ని ప్రజలు చవిచూశారు.
అయితే తాను పదవి నుంచి దిగబోనంటూ కొంత కాలంగా చెబుతూ వస్తున్న శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే ఎట్టకేలకు వెనక్కు తగ్గక తప్పలేదు. ఇటీవలే అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నివాసంలో కీలక కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజీనామా చేసేందుకు మహిందా రాజపక్సే అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ప్రధాని రాజీనామాతో కేబినెట్ రద్దు కానుంది.
Also Read: TS SPDCL Jobs: టీఎస్ ఎస్‌పీడీసీఎల్‌లో 1270 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
Also Read: NIA Raids on Dawood: దావూద్ అనుచరుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు.. ఏకకాలంలో 20 ప్రాంతాల్లో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook