భారత సరిహద్దు వైపు కాల్పుల విరమణ ఒప్పందానికి నిత్యం తూట్లు  పొడుస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ మరో అరాచక చర్యకు దిగింది. మానవ హక్కుల కోసం గొంతెత్తుతున్న బలూచిస్తాన్ నోరు నొక్కేసింది. 


అవును.. పాకిస్తాన్ లోని ఇమ్రాన్ సర్కారు.. మానవహక్కులపై మరోసారి ఉక్కుపాదం మోపింది. బలూచిస్తాన్ లోని మానవ హక్కుల అధికారిక వెబ్ సైట్లపై పూర్తిగా నిషేధం విధించింది. ఇప్పటికే  అక్కడి మీడియాపై ఆంక్షలు ఉన్నాయి. తాజాగా మానవహక్కుల వెబ్ సైట్ల నిషేధంతో.. మరింత అరాచకానికి తెరతీసింది. బలూచిస్తాన్ లో ఉన్న మానవహక్కుల వెబ్ సైట్లకు స్వీడన్, ఫ్రాన్స్, లండన్ లలోనూ బ్రాంచులు ఉన్నాయి. తద్వారా బలూచిస్తాన్ లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు ఆయా వెబ్ సైట్లు, మీడియా అంతర్జాతీయ సమాజానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. 
 [[{"fid":"185502","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరోవైపు మీడియాపై ఆంక్షలు బలూచిస్తాన్ లో కొత్త కాదని జర్నలిస్టు సంఘాలు చెబుతున్నాయి. బలూచిస్తాన్ పోస్ట్ ను పాకిస్తాన్ నిషేధించిందని తెలిపారు. బలూచిస్తాన్ ప్రభుత్వంపైనా పాకిస్తాన్ ఆంక్షలు విధించిందని చెప్పారు. ప్రజాభిప్రాయన్ని పాక్ తుంగలో తొక్కుతోందని విమర్శించారు. రాజకీయ కక్షతో, సైన్యం అణచివేతతో అరాచకం సృష్టిస్తోందని తెలిపారు. నిత్యం జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా క్రైమ్ యాక్ట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందని తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..