US Presidential Elections | ఎన్నికలు అనగానే కొందరు తమకు పట్టని వ్యవహారం అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కానీ ఎన్నికలు అంటే ఒక్క ఓటు కూడా కీలకం అవుతుంది. అలాంటి ఒక్కో ఓటు ప్రజా ప్రతినిధుల తలరాతల్ని మార్చేస్తుంది. కొన్ని సందర్భాలలో దూర ప్రాంతాల్లో ఉన్నవారు, ఉద్యోగాలు చేస్తుండటంతో సెలవు దొరకని వారు ఇతర ప్రత్యామ్నాయం కోసం చూస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా మహిళా వ్యోమగామి తన ఓటు హక్కును అంతరిక్షం నుంచి (Aastronaut Casts Vote From Space) వినియోగించుకున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నాసా వ్యోమగామి కేట్ రుబిన్స్ ఓటు వేశారు. ఈ మేరకు నాసా ఆస్ట్రోనాట్స్ తమ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ సమయంలో ఆమె అంతరిక్షంలో ఉంటారు. అందుకే అంతరిక్ష కేంద్రం నుంచి బాధ్యతగా అమెరికా వ్యోమగామి కేట్ రుబిన్స్ తన ఓటు హక్కును వినియోగించుకుని ఆ దేశ పౌరులకు ఆదర్శంగా నిలిచారు. బాద్యతగా ఉండటాన్ని అమెరికా పౌరులకు గుర్తుచేశారు.



 



 


కాగా, అక్టోబర్ 14న కేట్ రుబిన్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. మరో కొన్ని నెలలపాటు అక్కడే ఉండనున్నారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అక్టోబర్ 23న ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతరిక్షం నుంచి ఓటు హక్కును తొలిసారిగా 1997లో కల్పించారు. 1997లో తొలిసారిగా డేవిడ్ వోల్ఫ్ అనే ఆస్ట్రోనాట్ అంతరిక్షం నుంచి ఓటు వేశారు. ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్‌లో ఉండే వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డు అప్లికేషన్ ద్వారా వ్యోమగాములు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.



 



అమెరికా పౌరులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కేట్ రుబిన్ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. నాసా వీడియో తమ యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe