RR vs MI Match Hardik Pandya: ఐపీఎల్‌లో తొలి ఆటగాడు హార్దిక్ పాండ్యా.. శభాష్ అంటూ ప్రశంసలు

RR vs MI Match Hardik Pandya  | రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఇరుజట్ల అభిమానులతో పాటు నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. నల్లజాతి వారి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన తొలి ఐపీఎల్‌ క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు. 

Last Updated : Oct 26, 2020, 11:28 AM IST
RR vs MI Match Hardik Pandya: ఐపీఎల్‌లో తొలి ఆటగాడు హార్దిక్ పాండ్యా.. శభాష్ అంటూ ప్రశంసలు

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా ఆదివారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals)తో మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఇరుజట్ల అభిమానులతో పాటు నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. బ్యాటింగ్‌లో 21 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన దానికన్నా హాఫ్‌ సెంచరీ అనంతరం హార్దిక్‌ పాండ్యా మోకాలుపై నిల్చుని చేసిన విన్యాసం అందర్నీ ఆకర్షించింది. నల్లజాతీయుల కోసం జరుగుతున్న ఉద్యమం Black Lives Matterకి మద్దతు తెలిపాడు నల్లజాతి వారి కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన తొలి ఐపీఎల్‌ క్రికెటర్‌గా పాండ్యా నిలిచాడు.

 

పాండ్యా ’హీరో’చిత ఇన్నింగ్స్‌కన్నా ఓ మంచి పని కోసం మద్దతు తెలిపిన పాండ్యాకు విశేషమైన ఆదరణ పెరుగుతోంది. నిన్న మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ అనంతరం సైతం నల్లజాతి వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతూ విన్యాసం చేసిన పాండ్యా.. సహచర ఆటగాడు, వెస్టిండీస్‌ క్రికెటర్‌ కీరన్‌ పోలార్డ్‌కు సంజ్ఞలు చేయడం ప్రేక్షకులు గమనించారు. కానీ వారికి అసలు విషయం అప్పుడు అర్థం కాలేదు, మ్యాచ్‌ ముగిసిన అనంతరం #BlackLivesMatter అని తన ట్విట్టర్‌లో పాండ్యా పోస్ట్‌ చేయగానే శభాష్‌ హార్దిక్‌ పాండ్యా అని ప్రశంసిస్తున్నారు.

 

కాగా, ఐపీఎల్‌ తాజా సీజన్‌ జరుగుతుండగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. బీఎల్‌ఎం ఉద్యమానికి ఎవరు మద్దతు తెలపడం లేదని, ఆ విషయం గురించి ఎవరు మాట్లాడకపోవడం నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సహచర క్రికెటర్‌ కీరన్‌ పోలార్డ్‌కు మద్దతు తెలిపాడు పాండ్యా. 

 

ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా ఛేదించింది. బెన్‌ స్టోక్స్‌(107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకం, సంజూ శాంసన్‌(54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ద శతకాలతో చెలరేగి అజేయంగా నిలవడంతో 18.2 ఓవర్లలో 2 కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబైకిది నాలుగో ఓటమి కాగా, రాజస్థాన్‌కు ఇది 5వ విజయం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News