పాక్.. ఆఫ్ఘన్‌పై దాడుల్ని ఆపేయ్: నాటో
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ- నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించింది.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ- నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించింది. ఆఫ్ఘానిస్తాన్‌లో కూడా సరిహద్దు అవతలి నుంచి దాడులు జరుపుతోందని పాకిస్తాన్‌పై నాటో తీవ్ర ఆరోపణలు చేసింది.
నిన్న బ్రసెల్స్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో నాటో పాకిస్థాన్‌లో ఉగ్రవాదులకు కల్పిస్తున్న ఆశ్రయాల్ని మూసివేయాలని, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక వనరులు సమకూర్చడం, సరిహద్దు అవలి నుంచి దాడుల్ని కూడా నిలుపు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బెర్గ్ అన్నారు. ఆప్ఘానిస్థాన్ అధ్యక్షుడు ఆశ్రఫ్ ఘని ప్రాంతీయంగా అన్ని సంస్థలు, దేశాలతో మరింత సన్నిహితంగా ఉంటూ ఉగ్రవాదంపై పోరాడాలని నాటో పిలుపునిచ్చింది. ఆఫ్ఘాన్ ప్రభుత్వం చేపడుతున్న శాంతి చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని నాటో తెలియజేసింది.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్ యూనియన్‌ను అడ్డుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)ను ఏర్పాటు చేశాయి. 1949 ఏప్రిల్ 4న ఇది ఆవిర్భవించింది. సభ్యదేశంపై ఎవరైనా దాడిచేస్తే నాటో సైనికంగా దానికి రక్షణగా నిలవాలన్నది ఈ కూటమి ప్రధాన లక్ష్యం. సభ్య దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతాన్ని రక్షణకు కేటాయిస్తుంటాయి.