Mount Everest Height: ఎవరెస్టు శిఖరం ఎత్తు మారింది..త్వరలో అధికారిక ప్రకటన
Mount Everest Height: ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఏదంటే ఠక్కున చెప్పే పేరు ఎవరెస్టు శిఖరం. ఇప్పుడా శిఖరం ఎత్తు మరికాస్త పెరిగిందట. అదెలా సాధ్యమనుకుంటున్నారా..నిజమే. త్వరలో ప్రకటన కూడా రానుంది.
Mount Everest Height: ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఏదంటే ఠక్కున చెప్పే పేరు ఎవరెస్టు శిఖరం. ఇప్పుడా శిఖరం ఎత్తు మరికాస్త పెరిగిందట. అదెలా సాధ్యమనుకుంటున్నారా..నిజమే. త్వరలో ప్రకటన కూడా రానుంది.
ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన ఎవరెస్టు ఎత్తు ( Everest height ) పెరిగినట్టు స్పష్టంగా కన్పిస్తోందని కొన్ని సర్వేలు ధృవీకరిస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ విషయమైన అధికారిక ప్రకటన వెలువడకపోయినా..త్వరలో చైనా-నేపాల్ దేశాలు సంయుక్తంగా అధికారిక ప్రకటన విడుదల చేయనున్నాయి.
అసలు ఎవరెస్టు శిఖరం ( Mount Everest ) ఎత్తు పెరగడమేంటి...తగ్గడమేంటి అనుకుంటున్నారా..ఇదెలా సాధ్యమనే కదా మీ సందేహం. ఎందుకంటే పర్వతాల ఎత్తు అనేది కాలక్రమంలో పెరగడమనేది అసాధ్యం. మరి అటువంటప్పుడు నేపాల్-చైనా దేశాలు సంయుక్తంగా ఎవరెస్టు ఎత్తు పెరిగిందని ఎలా ప్రకటించబోతున్నాయి. ఆ వివరాలివే..
వాస్తవానికి ఎవరెస్టు ఎత్తు ఈ మధ్యకాలంలో పెరగలేదు. అధికారిక గణాంకాల ప్రకారం అంటే 1954లో భారతదేశం ( India ) చేపట్టిన సర్వే ఆధారంగా ఎవరెస్టు శిఖరం ఎత్తు 8 వేల 8 వందల 48 మీటర్లు.. అడుగుల్లో చెప్పాలంటే 29 వేల 29 అడుగులు. అయితే ఈ ఎత్తు విషయంలోనే చైనా, నేపాల్ దేశాల మధ్య ఎప్పట్నించో అభిప్రాయబేధాలున్నాయి. ఎవరెస్టు శిఖరానికి ఉత్తర దిశలోని టిబెట్ వైపు నుంచి శిఖరం ఎత్తుని లెక్కగట్టిన చైనా.. 2015లో ఏకపక్షంగా కేవలం రాత్రికి రాత్రి శిఖరం ఎత్తు 8844.04 మీటర్లుగా ప్రకటించింది. అయితే రాతి ఎత్తుతో పాటు మంచుపొర ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నది నేపాల్ వాదన. గత ఏడాది అక్టోబరులో చైనా ( China ) అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్ పర్యటన సందర్భంగా మంచుపొర ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న నేపాల్ ( Nepal ) ప్రతిపాదనను చైనా అంగీకరించింది. ఈ అంగీకారంలో భాగంగా ఇప్పుడు రెండు దేశాలు కలిసి సంయుక్తంగా ఎవరెస్టు శిఖరం కొత్త ఎత్తును ప్రకటించనున్నాయి. మంచుపొరతో సహా లెక్కవేస్తే..కచ్చితంగా ఎత్తు పెరుగుతుంది.
మరోవైపు అసలీ వాదన పెరగడానికి కారణం కూడా శాస్త్రీయమైనదే. 2015 నేపాల్ భూకంపం ( 2015 Nepal Earthquake ) అనంతరం ఎత్తు మారి ఉంటుందనేది నేపాల్ ప్రభుత్వ సందేహం. 2017లో ఎత్తును కొలిచే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రెండోవైపు మంచుపొరను కూడా ఎత్తులో పరిగణించే విషయం. ఈ రెండు అంశాల కారణంగా ఎవరెస్టు ఎత్తు ఇక మారనుంది. Also read: Sputnik v vaccine: 95 శాతం విజయవంతమని స్పుత్నిక్ ప్రకటన