Sputnik v vaccine: 95 శాతం విజయవంతమని స్పుత్నిక్ ప్రకటన

కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటీ సఫలమవుతున్నాయి. మొన్న ఫైజర్..నిన్న మోడెర్నా..ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందనే ప్రకటన ఆశలు రేపుతోంది.

Last Updated : Nov 25, 2020, 10:39 AM IST
  • 95 శాతం విజయవంతగా పనిచేస్తున్నట్టు ప్రకటించిన రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి
  • రెండు డోసుల ధర పది డాలర్లలోపే అన్న గమలేయా రీసెర్చ్ సెంటర్
  • రష్యన్ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్
Sputnik v vaccine:  95 శాతం విజయవంతమని స్పుత్నిక్ ప్రకటన

కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం జరుపుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటీ సఫలమవుతున్నాయి. మొన్న ఫైజర్..నిన్న మోడెర్నా..ఇప్పుడు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందనే ప్రకటన ఆశలు రేపుతోంది.

కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) కోసం దిగ్గజ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. మొన్న ఫైజర్ కంపెనీ ( Pfizer Company ) ప్రకటన..నిన్న మోడెర్నా ప్రకటన. ఇప్పుడు తాజాగా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ( Sputnik v vaccine ). ఈ వ్యాక్సిన్  95 శాతం విజయవంతంగా పనిచేస్తున్నట్టు వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు ప్రకటించారు. వ్యాక్సిన్ రెండు డోసుల్ని 10 డాలర్లలోపే అందిస్తామని..రష్యన్ ప్రజలకు మాత్రం ఉచితంగా ఇస్తామని వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన గమలేయా రీసెర్చ్ సెంటర్ ( Gamaleya research centre ) ప్రకటించింది. వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలని తెలిపింది. తొలి డోసు ఇచ్చిన 42 రోజుల తరవాత సేకరించిన డేటా ఆధారంగా వ్యాక్సిన్ ప్రభావం ఏ మేరకుందో లెక్కించామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మొత్తం 39 కేసుల్ని పరిశీలించగా..తొలిడోసు పూర్తయిన 28 రోజులకు వ్యాక్సిన్ 91.4 శాతం సమర్ధవంతంగా పనిచేసినట్టు తేలిందని రష్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. రెండోడోసు ఇచ్చిన తరువాత..అంటే మొత్తం 42 రోజుల తరువాత 95 శాతం కంటే ఎక్కువే సమర్ధవంతంగా పనిచేసిందని వెల్లడించింది. 

అయితే పూర్తి గణాంకాల్ని కంపెనీ వెల్లడించలేదు. అటు అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్, మోడెర్నా వ్యాక్సిన్ ( Moderna vaccine )‌లు కూడా 95 శాతం సమర్దవంతంగా పనిచేస్తుందని ఆ కంపెనీలు ప్రకటించాయి.  తాజాగా ఆక్స్‌ఫర్డ్ ( Oxford ) సైతం తమ వ్యాక్సిన్ అద్బుతంగా పనిచేస్తోందని తెలిపింది. Also read: America: డిసెంబర్ 11, 12 తేదీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ?

 

Trending News