Nestle Company: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎఫెక్ట్.. ఈ దేశంలో నెస్లే కంపెనీ క్లోజ్
Nestle Shut Down In Israel: ఇజ్రాయెల్‌లో తమ ప్రొడక్ట్ కంపెనీని తాత్కలింగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది నెస్లే. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తమకు ఉద్యోగులను సురక్షితంగా ఉంచడమే ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Nestle Shut Down In Israel: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం సామాన్యులపైనే కాదు.. చాలా వ్యాపార కంపెనీలపై కూడా పడుతోంది. హమాస్ ఉగ్రవాదుల దాడి తరువాత.. ఇజ్రాయెల్ సైన్యం ప్రతిదాడులు మొదలుపెట్టింది. ఉగ్రవాదులు స్థావరంగా మార్చుకున్న గాజా నగరంపై దండెత్తింది. భూతల మార్గం ద్వారా తీవ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగిస్తోంది. ఇక ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలో ఒకటి అయిన నెస్లే కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో తమ వ్యాపారాన్ని తాత్కలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధ పరిస్థితులు దృష్ట్యా తమ ప్లాంట్‌ను కొంతకాలం మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే చాలా కంపెనీలు తమక కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసి.. ఇంటి నుంచి పని చేయాలని ఉద్యోగులను కోరిన విషయం తెలిసిందే.
అయితే ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మూసివేసిన మొదటి వినియోగదారు ఉత్పత్తుల సంస్థ నెస్లేనే. రెండు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తప్పనిపరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. “మా ఉద్యోగులను సురక్షితంగా ఉంచడంపై మా దృష్టి ఉంది. వ్యాపార అభివృద్ధిపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ విషయం గురించి ఇప్పుడే ఏం మాట్లాడలేను” అని నెస్లే చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ ష్నైడర్ తెలిపారు. తాము అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ఇజ్రాయెల్‌లో ఏడు ఉత్పత్తులను తయారు చేస్తోంది నెస్లే. కిట్‌క్యాట్ మేకర్, మిఠాయి, సిద్ధం చేసిన వంటకాలు, పవర్‌తో ఉన్న కూల్ డ్రింక్స్, పోషకాహారం, ఆరోగ్యానికి సంబంధించి ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇక ఓవరాల్ కంపెనీ విషయానికి వస్తే.. ఇది ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ. మ్యాగీ, చాక్లెట్, స్వీట్లు సంబంధిత వస్తువులను తయారు చేస్తుంది. ప్రస్తుతం నెస్లే కంపెనీ షేరు విలువ ఈ రోజు రూ.24,122.00 గా ఉంది. నేడు కంపెనీ షేర్లలో 3.66 శాతం అంటే రూ.852.35 పెరిగింది.
ఇది కూడా చదవండి: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..
ఇది కూడా చదవండి: Lava Blaze Pro 5G Price: బంఫర్ ఆఫర్ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.