మళ్లీ పుట్టుకొచ్చిన ఎబోలా వైరస్.. మొదలైన మరణాలు
కరోనా వైరస్ సవాల్ నుంచి గట్టెక్కకముందే ప్రపంచ దేశాలకు మరో పెనుముప్పు పొంచి ఉంది. ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola Virus) మరోసారి పుట్టుకొచ్చింది. మరణాలు సంభవించాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది.
ప్రపంచ దేశాల ముందు మరో వైరస్ ముప్పు సవాల్‌గా నిలవనుంది. ఇప్పటివకే కరోనా వైరస్ (Corona Virus) లాంటి ప్రాణాంతక మహమ్మారి నుంచి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అత్యంత ప్రమాదకర ఎబోలా వైరస్ (Ebola Virus) మరోసారి బయటపడింది. ఆఫ్రికా దేశమైన కాంగో (Congo)లో ఎబోలా వైరస్ మళ్లీ పుట్టుకొచ్చింది. దారుణం.. CoronaVirusను అంతం చేసేందుకు నరబలి
కాంగోలోని పశ్చిమప్రాంతం ఈక్వెటర్ ప్రావిన్స్ ఎంబండకలో ఎబోలాను గుర్తించినట్లు దేశ అధికారులు తెలిపారు. ఎబోలా కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారని, మరికొందరు చికిత్స పొందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడనామ్ ఘేబ్రియేసస్ ట్వీట్ చేశారు. గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
గతంలో ఎబోలాతో పోరాడిన కాంగో మరోసారి ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కుంటోంది. తొలిసారి 1976లో అక్కడ ఎబోలా వైరస్ కేసును గుర్తించారు. అయితే ఎబోలా కేవలం మనకు హెచ్చరిక లాంటిదేనని, కోవిడ్19 (COVID19) ప్రపంచ దేశాల ముందున్న అసలుసిసలైన సవాల్ అని టెడ్రోస్ అడనామ్ పేర్కొన్నారు. చివరిదశలో ఉండగా మరోసారి ఎబోలా వైరస్ కాంగోలో ప్రాణాలు హరించడం ఆందోళనకు గురిచేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి