Nithyananda swamy: నిత్యానందస్వామి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుని..దేశం వదిలి పారిపోయిన స్వామీజీ. చిన్న దేశం ఏర్పర్చుకున్న ఆ స్వామీజీ కరోనా మహమ్మారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్న నిత్యానంద స్వామి (Nithyananda Swamy) గురించి పెద్దగా చెప్పవల్సిన అవసరం లేదు. 2019లో దేశం వదిలి పారిపోయి..దక్షిణ అమెరికా చేరుకున్నాడు. ఆ ఖండంలోని ఈక్వెడార్ (Equador)సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసుకుని..కైలాసగా నామకరణం చేసి..తనంతట తానుగా ఓ దేశంగా రూపొందించుకున్నాడు. ఆ దేశానికి ప్రత్యేక జెండా, పాస్‌పోర్టు, జాతీయ చిహ్నం ఏర్పర్చుకున్నాడు. రిజర్వ్ బాంక్ కూడా స్థాపించాడు. అంతేకాదు కరోనా మహమ్మారి నేపధ్యంలో కొన్ని దేశాల రాకపోకలపై నిషేధం విధించాడు. కైలాస దేశాన్ని గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితికి లేఖ సైతం రాశాడు. 


కరోనా మహమ్మారి అంతం గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో కెక్కాడు.ఇండియాలో కరోనా వైరస్(Corona Virus)తీవ్రంగా విజృంభించడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను భారత భూభాగంపై ఎప్పుడు అడుగు పెడతానో..అప్పుడే కరోనా అంతమవుతుందని చెప్పాడు. శిష్యులతో మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించాడట. ఇప్పడీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


Also read: Pakistan Train Accident: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం, 30 మందికి పైగా మృతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook