Nobel Peace Prize 2020: వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి పురస్కారం
అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని (Nobel Peace Prize 2020) నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) కు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.
Nobel Peace Prize 2020: న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని (Nobel Peace Prize 2020) నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు కృషి చేసిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) కు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల నివారణకు, అదేవిధంగా సంక్షోభ ప్రాంతాల్లో అందించిన సేవలకు డబ్ల్యూఎఫ్‌పీ (World Food Programme) ఎంతో దోహదపడిందని నోబెల్ కమిటీ పేర్కొంది. ఈ మేరకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌కు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించినట్లు.. శుక్రవారం స్టాక్‌హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో నోబెల్ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో డబ్ల్యూఎఫ్‌పీ ఆకలి చావుల నివారణకు, అదేవిధంగా అంతర్ యుద్ధంతో రగులుతున్న ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు పెద్ద పెద్ద కార్యక్రమాలను సైతం చేపట్టిందని నోబెల్ కమిటీ పేర్కొంది. 2019లో దాదాపు 88 దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న సుమారు వంద మిలియన్ల మందికి ఆహారాన్ని అందించిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌ను నోబెల్ కమిటీ ప్రశంసించింది. Also read: US-Presidential Elections: ర్యాలీలకు సిద్ధం అంటున్న ట్రంప్...వర్చువల్ అంటున్న అధికారులు
అయితే ఈ నోబెల్ బహుమతి విలువ పది మిలియన్ స్వీడిష్ క్రౌన్స్ ఉంటుంది. దీనిని డిసెంబర్ 10 న ఓస్లోలో జరిగే కార్యక్రమంలో అందించనుంది నోబెల్ కమిటీ. ఇదిలాఉంటే.. ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి కోసం నోబెల్ కమిటీకి 318 నామినేషన్లు అందాయి. వాటిలో 211 వ్యక్తులు ఉండగా.. 107 సంస్థలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి సంస్థకే వరించింది. Also read: Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe