Nobel Prize 2022: మానవ పరిణామ క్రమంపై పరిశోధనకు వైద్య నోబెల్.. పాబోను వరించిన ప్రతిష్టాత్మక అవార్డు..
Nobel Prize 2022: ఈ ఏడాది నోబెల్ సందడి మెుదలైంది. సోమవారం వైద్యరంగానికి సంబంధించిన నోబెల్ విజేతను జ్యూరీ ప్రకటించింది.
Nobel Prize 2022: ఈ ఏడాది వైద్యరంగానికి సంబంధించిన నోబెల్ విజేతను సోమవారం ప్రకటించారు. మెడిసిన్ లో విశేష కృషి చేసిన స్వీడన్ కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబో(67)ను నోబెల్ పురస్కారం వరించింది. మానవ పరిణామ క్రమంపై అనేక ఆవిష్కరణలు చేసినందుకు గానూ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మానవులకు అత్యంత సమీప జాతిగా భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో (Svante Paabo) నాయకత్వం వహించారు.
1955లో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జన్మించిన స్వాంటే పాబో ప్రస్తుతం లీప్‌జిగ్‌లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీకి డైరెక్టర్‌గా ఉన్నారు. 1982లో వైద్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న సునే బెర్గ్‌స్ట్రోమ్ కుమారుడు స్వాంటే పాబో.
ఇవాళ భౌతికశాస్త్ర నోబెల్ విజేతను ప్రకటించనున్నారు. బుధవారం రసాయన, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. అయితే ఆర్థిక రంగానికి సంబంధించిన నోబెల్ విజేతను మాత్రం అక్టోబరు 10న ప్రకటించనున్నారు. నోబెల్ విజేతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీని డిసెంబరు 10న అందజేస్తారు. స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరుమీద ఈ అవార్డులను 1901 నుంచి ఇస్తున్నారు.
Also Read: Afghanistan: అఫ్ఘనిస్థాన్‌లో మరో ఆత్మాహుతి దాడి..53 మంది మృతి..పలువురికి గాయాలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook