Nobel Prize in Physics 2021: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
భౌతిక శాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీలు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
Nobel Prize in Physics: 2021 సంవత్సరానికిగానూ..భౌతిక శాస్త్రం(Nobel Prize in Physics 2021)లో ముగ్గురిని నోబెల్ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో(Syukuro Manabe), క్లాస్ హాసిల్‌మన్, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ మంగళవారం ప్రకటించింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై పరిశోధనలకు గానూ వీరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే ఇందులో జార్జియో పారిసీ(Giorgio Parisi)కి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్ హాసిల్‌మన్(Klaus Hasselmann) పంచుకోనున్నారు.
భూ పర్యావరణ భౌతిక నమూనా, వైవిధ్యాలను లెక్కించడం, గ్లోబల్ వార్మింగ్‌ను అంచనా వేయడంలో చేసిన కృషికి గానూ అమెరికాకు చెందిన సుకురో మనాబో, జర్మనీకి చెందిన హాసిల్‌మన్‌లకు సంయుక్తంగా నోబెల్ బహుమతి ప్రకటించారు. పరమాణువుల నుంచి గ్రహాల స్థితి గతులు, వలయాల వరకు భౌతిక వ్యవస్థల్లో హెచ్చుతగ్గులు, వాటి పరస్పర చర్యలను కనుగొన్నందుకు గానూ ఇటలీకి చెందిన జార్జియో పారిసీకి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. వైద్యశాస్త్రంలో 2021 సంవత్సరానికి గాను అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లకు నోబెల్ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే.
ఈ నోబెల్ పురస్కారం(Nobel Prize) కింద బంగారు పతకంతో పాటు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్ ($ 1.14 మిలియన్లకు పైగా) నగదు బహమతిగా అందజేస్తారు. ప్రైజ్ మనీ సృష్టికర్త, స్వీడిష్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్(Alfred Nobel) 1895 లో మరణించారు. అప్పటి నుంచి ఆయన పేరుతో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలందించిన వారికి నోబెల్ బహుమతిని అందజేస్తున్నారు. వైద్య శాస్త్రంతోపాటు భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్ర రంగాలలో అత్యుత్తమమైన సేవలందించినవారికి ఈ బహుమతి ప్రకటిస్తుంటారు.
Also Read: Nobel Prize 2021: వైద్యశాస్త్రంలో ఇద్దరి అమెరికన్లకు నోబెల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి