US Election: నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రదిపాదన..ఎన్నికల ప్రచారాస్త్రమా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ( Before America Elections ) ముందు అంతర్జాతీయ నోబెల్ శాంతి పురస్కారం ( International peace prize ) ప్రతిపాదన. ఇది డోనాల్డ్ ట్రంప్ కు పాచికలా ఉపయోగపడనుందా. అమెరికాలో ఏం జరుగుతోంది? నార్వే ఎంపీ ట్రంప్ పేరును ప్రతిపాదించడం వెనుక వేరే ఉద్దేశ్యముందా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ( Before America Elections ) ముందు అంతర్జాతీయ నోబెల్ శాంతి పురస్కారం ( International peace prize ) ప్రతిపాదన. ఇది డోనాల్డ్ ట్రంప్ కు పాచికలా ఉపయోగపడనుందా. అమెరికాలో ఏం జరుగుతోంది? నార్వే ఎంపీ ట్రంప్ పేరును ప్రతిపాదించడం వెనుక వేరే ఉద్దేశ్యముందా ?
నోబెల్ శాంతి పురస్కారం 2021 ( Nobel 2021 peace prize ) సంవత్సరానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donal trump ) పేరును నామినేట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలకు ముందు...డోనాల్ట్ ట్రంప్ రెండోసారి అధ్యక్షబరిలో ఉన్న తరుణంలో నోబెల్ పురస్కారానికి నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. నార్వా ఎంపీ ( norway mp ) టిబ్రింగ్ జడ్జే...2021 నోబెల్ శాంతి బహుమతికి డోనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల పరిష్కారానికి ట్రంప్ చొరవ చూపించారని నార్వే ఎంపీ వాదన. ఇజ్రాయిల్-యూఏఈ మధ్య ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం చారిత్రాత్మకమైందని ఆయన ప్రశంసించారు. మధ్య ప్రాచ్య దేశాల్లో సైనిక దళాల తగ్గింపుతో పాటు శాంతి సాధనకు ట్రంప్ విశేషంగా ప్రయత్నం చేశారన్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు 13 న డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఒప్పందం ట్రంప్ విదేశాంగ విధానమే కీలకమైన విజయంగా ఆయన అభివర్ణించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ..సరిగ్గా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ హఠాత్తుగా ట్రంప్ పేరు ప్రతిపాదనకు రావడం కచ్చితంగా ఎన్నికల్లో లబ్ది పొందేందుకేనని విమర్శకులు చెబుతున్న మాట. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో నోబెల్ ప్రతిపాదనను ట్రంప్ కార్డుగా ఉపయోగించనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కరోనా మహమ్మారిని నియంత్రించే విషయంలో ట్రంప్ పై దేశంలో అసమ్మతి ఎక్కువగా ఉందని..దీన్నించి తప్పించుకునేందుకు ఈ తరహా ట్రంప్ కార్డు ప్రదర్శిస్తున్నారని విమర్శించేవారు లేకపోలేదు.
ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. వీరిలో రూజ్‌వెల్ట్, వుడ్రూ విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలున్నారు. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనా సరే...విజేత ఎవరనేది మాత్రం 2021 అక్టోబర్ తరువాతే ప్రకటిస్తారు. ఈ నేపధ్యంలో ఈ నామినేట్ ట్రంప్ ఎన్నికల ప్రచారాస్త్రంగా ( Election campaign ) ఉపయోగపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. Also read: AstraZeneca Vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR