North Korea issued shoot-to-kill orders: వాషింగ్టన్: ఆధునిక నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ (Kim Jong-un) ఉన్ అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రూపొందించే చట్టాలు.. వేసే శిక్షలు అలా ఉంటాయి. జోంగ్ ప్రతీ విషయంపై అనవసర నిర్ణయాలు తీసుకుంటూ.. కొన్ని దేశాలకు కొరకరానికొయ్యగా మారారు. జోంగ్ ఏక్షణంలో అయినా.. వార్తల్లో నిలుస్తారు.. ఎందుకంటే ఆయన తీసుకునే చర్యలు.. చేష్టలు అలా ఉంటాయి. తాజాగా నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ మరో నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. కరోనా (Coronavirus) వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా సరిహద్దులో రెండు కిలోమీటర్ల మేర బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేసి.. చైనా నుంచి ఉత్తర కొరియా దేశంలోకి అక్రమంగా రాకపోకలు సాగించేవారి కాల్చివేతకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఇందుకోసం నార్త్ కొరియా స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అధికారాలు ఇచ్చినట్లు దక్షిణ కొరియాలోని అమెరికా దళాల కమాండర్‌ రాబర్ట్‌ అబ్రామ్స్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. Also read: AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్


అయితే ఉత్తర కొరియా (North Korea ) దేశం చైనా (china) తో సరిహద్దును జనవరిలోనే మూసివేసింది. కరోనా వ్యాప్తి మేరకు దేశంలో పూర్తిస్థాయి ఎమర్జెన్సీని విధించినట్లు నార్త్ కొరియా అధికారిక మీడియా జూలైలో ప్రకటించింది. అయితే ఆ దేశంలో కరోనావైరస్ కేసుల వివరాలు ఇంతవరకు బయటకు రాకపోవడం గమనార్హం. Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..