Pfizer vaccination: ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని నార్వేలో 23 మంది మృతి
కోవిడ్ వ్యాక్సినేషన్ మంచిదా కాదా..ఇప్పుడీ సందేహం పెరిగిపోతోంది. నార్వేలో జరిగిన విషాదం ఈ సందేహానికి బలం చేకూరుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 23 మంది మరణించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ మంచిదా కాదా..ఇప్పుడీ సందేహం పెరిగిపోతోంది. నార్వేలో జరిగిన విషాదం ఈ సందేహానికి బలం చేకూరుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఏకంగా 23 మంది మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid vaccination ) ప్రారంభమైంది. కొన్నిదేశాల్లో ఫైజర్ వ్యాక్సిన్ ( Pfizer Vaccine )..మరికొన్ని దేశాల్లో మోడెర్నా ( Moderna vaccine ) కంపెనీ వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca vaccine ) అభివృద్ధి చేసిన వ్యాక్సినేషన్‌తో పాటు స్వదేశీ వ్యాక్సిన్ కోవ్యాగ్జిన్ ( Covaxin ) వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కానీ ఈ మధ్యకాలంలో ప్రజల్లో వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో అంతగా ఆసక్తి కన్పించడం లేదు. వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదా కాదా, దుష్పరిణామాలేవైనా తలెత్తుతాయా అనే సందేహాలు అధికమవుతున్నాయి.
ఈ నేపధ్యంలో నార్వే ( Norway ) లో జరిగిన విషాదం వ్యాక్సిన్‌పై వస్తున్న సందేహాలకు బలం చేకూరుస్తోంది. నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోస్ట్‌మార్టమ్ చేయగా..వ్యాక్సిన్ అనంతర దుష్పరిణామాలు తలెత్తి..తీవ్రమై మరణించారని నార్వేజియన్ మెడికల్ ఏజెన్సీ తెలిపింది.
ఈ ఘటనతో నార్వే ప్రభుత్వం ( Norway Government ) అప్రమత్తమైంది. వృద్ధులు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని నార్వే అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా జీవితకాలం తక్కువగా ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనముండదని నార్వే ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజర్ కంపెనీ విచారణ చేస్తోంది. ఇప్పటివరకూ నార్వేలో వైరస్ రిస్క్ ఉన్న 33 వేలమందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. 29 కేసుల్లో దుష్పరిణామాలు తలెత్తగా.. వీరిలో అధికశాతం 80 ఏళ్లు దాటినవారే కావడం విశేషం.
Also read; Turkey: టర్కీలో అడుగంటుతున్న నీళ్లు..కరువు పరిస్థితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook