Omicron variant cases nearly double here in a day : బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజులోనే అక్కడ 249 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అక్కడ ఒక్క రోజులోనే రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఇంగ్లడ్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌కి సంబంధించిన మొత్తం కేసులు 817కు చేరాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50% కేసులకు ఒమిక్రాన్ కారణం అవుతుంది


బ్రిటన్‌లో (Britain) కేసులు మరింత పెరగనున్నాయని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. పరిస్థితులు గత రెండు వారాల మాదిరిగానే ఉంటే.. రాబోయే రెండు లేదా నాలుగు వారాల్లో 50% కరోనా కేసులు ఒమిక్రాన్ కారణంగానే వస్తాయని పేర్కొంది. 


కొన్ని రోజుల క్రితమే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) ఇంగ్లాడ్ ప్రజలకు కొన్న సూచనలు చేశారు. దేశంలో ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు తప్పనిసరి చేశారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) ప్రకటించారు. కోవిడ్ పాస్ వాడకం తప్పనిసరి చేశారు.


చాలా వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్


ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) చాలా వేగంగా సోకుతుందన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఒమిక్రాన్ లక్షణాలు కూడా మునుపటి వేరియంట్‌ల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటున్నాయని తేలింది. ఈ కోవిడ్ కొత్త వేరియంట్ ప్రభావం వల్ల మనిషిలోని రోగనిరోధక శక్తి కూడా పూర్తిగా తగ్గుపోతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 


Also Read : Night Curfew: 'రాత్రి పూట కర్ఫ్యూని పరిశీలించండి.. కఠిన నిబంధనలు విధించండి'


మొత్తానికి ఒమ్రికాన్ ఇప్పడు సౌత్ ఆఫ్రికాలో (South Africa) కంటే బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక ఈ నెల చివరినాటికి బ్రిటన్‌లో రోజుకు అరవై వేల కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. రాబోయే రెండు నుంచి నాలుగు వారాల్లో బ్రిటన్‌లో బయటపడే మొత్తం కరోనా కేసుల్లో సగం ఒమిక్రాన్‌ (Omicron) కేసులే ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఒమిక్రాన్ ఎంత ఆందోళన కలిగించే విషయమని, అయితే మనం ఈ కొత్త వేరియంట్‌ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత దాని బారినపడకుండా ఉండొచ్చని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ (Vaccination) ఒక్కటే దీనికి రక్ష అని సూచించారు. రెండు డోసులు వ్యాక్సినేషన్‌తో పాటు అలాగే బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ఎంత ప్రభావం చూపుతుందనే విషయం ఇంకా వెల్లడికాలేదు. అయితే వ్యాక్సినేషన్‌ రెండు డోసులు తీసుకున్న వారు కూడా ఒమిక్రాన్ (Omicron) బారినపడుతున్నారు.


Also Read : Omicron strain: మహారాష్ట్రలో 'ఒమిక్రాన్' కలవరం...ముంబయిలో 144 సెక్షన్ అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook