Oxford-AstraZeneca Covid-19 vaccine can be 70% effective: న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ మరో సంతోషకరమైన వార్తను వెల్లడించింది. మూడవ దశ ట్రయల్స్‌లో తమ టీకా 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సోమవారం వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో ప్రయోగాల్లో భాగంగా.. యూకే, బ్రెజిల్‌లలో 23వేల మంది వాలంటీర్లపై నిర్వహించగగా.. మధ్యంతర ఫలితాల్లో ఈ విషయం తేలినట్లు ఆక్స్‌ఫర్డ్ పేర్కొంది. ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లను రెండు గ్రూపులుగా విభజించి నెల రోజులకు ఒకటి చొప్పున రెండు వ్యాక్సిన్‌ డోసులను అందించారు. మొదటిసారి సగం డోసు.. రెండోసారి పూర్తి డోసును అందించిన గ్రూపులోని వలంటీర్లలో 90 శాతం సమర్థతను గుర్తించారు. అయితే రెండు కూడా ఫుల్‌ డోసులు అందించిన గ్రూపులోని వలంటీర్లలో 62 శాతం ప్రభావశీలత మాత్రమే కనిపించింది. మొత్తంగా పరిగణలోకి తీసుకోని ఈ వ్యాక్సిన్‌ 70 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ పేర్కొంది. 



ఈ ప్రకటనపై భారత ఫార్మ దిగజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా (Adar Poonawalla) హర్షం వ్యక్తంచేశారు. ఇప్పటికే నాలుగు కోట్ల డోసులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే.. జనవరి నాటికి 10కోట్ల డోసులు అందిస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే.. ఆస్టాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ తో జతకట్టిన సీరం సంస్థ.. వ్యాక్సిన్ (AstraZeneca vaccine ) ఉత్పత్తితోపాటు భారత్‌లో మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి