Moon's surface has enough oxygen to keep billions of people alive: చంద్రుడిపైకి వెళ్లాలని.. అక్కడే శాస్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని మానవులు కొన్నేళ్లుగా కలలు (Living on moon) కంటున్నారు. ఇప్పటికే నాసా (NASA moon) అపోలో మిషన్​ ద్వారా పలు మార్లు కొంత మంది వ్యోమగాములు చంద్రుడిపై కాలు మోపి చరిత్ర సృష్టించారు. అయితే నివాసం ఏర్పాటు చేసుకునే విషయంలో మాతరం ఇంకా ఎలాంటి పురోగతి లభించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మానవుడు జీవించాలంటే.. అందుకు గాలి, నీరు.. వంటివి తప్పనిసరి. అందుకే వివిధ గ్రహాలపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలను కనుగొంటున్నారు. ఇందులో భాగంగా చంద్రుడిపై నీటి అడుగుజాడను ఇప్పటికే కనుగొన్నారు.


ఇటీవల తమ పరిశోధనల్లో మరింత పురొగతి సాధించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు ఉన్నట్లు (Oxygen on Moon) గుర్తించారు. అది కూడా ... ప్రస్తుతం భూమి మీద ఉన్న మొత్తం జనాభాకు (800 కోట్లు మందికి) లక్ష ఏళ్లకు సరిపోయేంత ఉందని చెబుతున్నారు.


Also read: Chandra Grahanam 2021:నవంబర్ 19న కార్తీక పౌర్ణమి..ఆ రోజే చంద్ర గ్రహణం..ఆ రాశిపై


ఖనిజాల్లో ప్రాణవాయువు..


చందమామ ఉపరితలంపై ఉన్న  మట్టికి మాతృకగా పిలిచే రిగోలిథ్​​లో దాదాపు 45 శాతం ఆక్సిజన్ ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. సిలికా, ఐరన్​, అల్యూమినియం వంటి ఖనిజ నిక్షేపాలు భారీ మొత్తంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వీటన్నింటిలోను ఆక్సిజన్​ ఉంటుందని చెప్పారు. అయితే అది మానవులు శ్వాస తీసుకునేందుకు ఉపయోగకరం కాదని తెలిపారు.


దీనిని వెలికి తీసి శుద్ది చేసి వాడుకోగలిగితే.. 800 కోట్ల మందికి లక్ష ఎళ్లకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఆ రిగోలిథ్​​లో ఉన్నాయని చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.


Also read: Delhi Pollution: ఢిల్లీలో చేయుదాటుతున్న పరిస్థితులు.. లాక్‌డౌన్‌ వైపుగా కేజ్రీవాల్..ఎమర్జెన్సీగా ప్రకటించిన సుప్రీం


Also read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు!


ఎలా లెక్కించారంటే..


చంద్రుడిపై కఠినమైన శిలాజాలను మినహాయించి.. మట్టిలా ఉండే రిగోలిత్​ 10 మీటర్ల లోతు వరకు ఉంటుందని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఇందులో ఒక క్యూబిక్ మీటర్ శాంపిల్​లో 1.4 టన్నుల ఖనిజాలు ఉంటాయిని చెప్పారు. అందులో 630 కిలోల ఆక్సిజన్ ఉంటుందని అంచనా వేశారు.


మానవుడు ఒక రోజుకు సగటున 800 గ్రాముల ఆక్సిజన్​ను తీసుకుంటాడు. 630 కిలోల ఆక్సిజన్​తో రెండేళ్లకుపైగానే జీవించే వీలుది. అంటే ఈ లెక్కన భూమిపై ఉన్న మానవులందరికి లక్ష ఏళ్లకుపైపగా సరిపోయేంత ఆక్సిజన్ నిల్వలు ఆ ఖనిజాల్లో ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.


Also read: T20 WC Final: ఆసీస్ కే గెలిచే అవకాశాలు ఎక్కువ: గావస్కర్


Also read: T20 World Cup 2021 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ నేడు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో గెలిచేదెవరు?


ఖనిజాల నుంచి ఆక్సిజన్​ వెలికి తీయడం సాధ్యమేనా?


చంద్రుడిపైకి ఓ రోవర్​ను పంపి.. దాని ద్వారా సేకరించిన మట్టి, రాళ్ల నుంచి ఆక్సిజన్​ వేరు చేసే ప్రాజెక్టుకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది ఆస్ట్రేలియా. ఇందుకోసం నాసాతో ఓ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2026లో ఈ ప్రయోగం నిర్వహించాలనుకుంటున్నట్లు ఇటీవల తెలిసింది. భవిష్యత్‌లో మానవ అంతరిక్ష జీవనానికి తోడ్పాటు అందించాలనేదే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం.


ఇదిలా ఉండగా.. అదే దేశానికి చెందిన ఓ ప్రేవేటు కంపెనీ.. 2024లోనే ఓ రోవర్​ను చంద్రుడిపైపకి పంపాలని భావిస్తోంది. అయితే జాబిల్లిపై నీటి జాడను కనిపెట్టడం దీని ముఖ్య ఉద్దేశం.


వీటితో పాటు.. బెల్జియం సహా పలు ఇతర దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఆక్సిజన్​ను సేకరించే మిషిన్లపై పని చేస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో ఈ ప్రయోగాలు ప్రయోగ  దశకు చేరుకునే అవకాశాలున్నాయి.


Also read: Special Coins: రూ.75 & 100 కాయిన్లను జారీ చేయనున్న రిజర్వ్ బ్యాంక్


Also read: Earthquake In Vizag: వైజాగ్ లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి