Pakistan Former Prime Minister Nawaz Sharif: పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆర్థిక ఇబ్బందులకు మాజీ జనరల్‌లు, న్యాయమూర్తులు కారణమని ఆరోపించారు.  పొరుగు దేశం భారత్ చంద్రుడిపైకి చేరుకుందని.. జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని.. కానీ తమ దేశం మాత్రం డబ్బుల ప్రపంచాన్ని అడుక్కుంటోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న గందరగోళానికి పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, మాజీ స్పైమాస్టర్ ఫైజ్ హమీద్ కారణమని ఆయన మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"భారతదేశం చంద్రునిపైకి చేరుకుంది. జీ20 సమావేశాలు విజయవంతంగా నిర్వహించింది. కానీ పాకిస్థాన్ ప్రధాని నిధుల కోసం దేశానికి దేశాలు తిరుగుతున్నాడు. భారత్ సాధించిన ఘనతలను పాకిస్థాన్ ఎందుకు సాధించలేకపోయింది. దీనికి ఇక్కడ బాధ్యులెవరు?" అని లండన్ నుంచి వీడియో లింక్ ద్వారా లాహోర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో షరీఫ్ ప్రశ్నించారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ అనేక సంవత్సరాలుగా పతనావస్థలో ఉందని.. ఇది అదుపు చేయలేక రెండంకెల ద్రవ్యోల్బణం రూపంలో పేద ప్రజలపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోందని ఫైర్ అయ్యారు. 


భారతదేశ ఆర్థిక వృద్ధిని కొనియాడారు పాక్ మాజీ ప్రధాని. పాకిస్థాన్ అప్పులు తీర్చలేని స్థితిలో ఉండటం విచారకరమని ఆయన అన్నారు. 1990లో తమ ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను భారతదేశం అనుసరించిందని అన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా,మాజీ స్పైమాస్టర్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (DG-ISI) డైరెక్టర్ జనరల్ ఫైజ్ హమీద్‌లకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫెవరీజం చూపించారని ఆరోపించారు. ఖాన్ హయాంలో బజ్వా పదవీకాలం పొడిగించారని.. హమీద్ DG-ISIగా నియమితులయ్యారని గుర్తు చేశారు.


ప్రస్తుతం లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్.. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలని చూస్తున్నారు. పాక్‌లో ఎన్నికల తేదీల విషయంలో న్యాయవ్యవస్థ, శాసనమండలి, కార్యనిర్వాహక వర్గాల్లో వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఎన్నికలపై గందరగోళం నెలకొంది. జనవరి 2024లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంతో పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. సాధారణ సందర్భాల్లో అసెంబ్లీ పదవీకాలం పూర్తికాగానే 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.


Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది  


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook