Suicide Bombing at Mosque in Pakistan: పాకిస్థాన్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం పెషావర్‌లోని పోలీస్ లైన్స్ ప్రాంతంలోని మసీదులో పేలుడు సంభవించింది. ప్రార్థనల సమయంలో దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడని చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లినట్లు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పేలుడులో ఇప్పటివరకు 17 మంది మరణించగా.. 90 మందికిపైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయి ఉంటారని భయాందోళన చెందుతున్నారు. పేలుడు అనంతరం ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతాన్ని పాకిస్థాన్ సైన్యం చుట్టుముట్టింది. ఆర్మీ యూనిట్ కార్యాలయం కూడా పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఉందని చెబుతున్నారు. 


పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయిందని చెబుతున్నారు. ప్రార్థనల సమయంలో దుండగుడు తనను తాను పేల్చేసుకున్నాడు. పెషావర్‌లోని మసీదులో పేలుడు శబ్ధం 2 కిలోమీటర్ల వరకు వినిపించింది. పేలుడు తర్వాత దుమ్ము, పొగలు కమ్ముకున్నాయని పోలీసు లైన్‌లో ఉన్న ప్రజలు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో కూడా పాకిస్థాన్‌లో భారీ దాడి జరిగింది. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో ఫిదాయీన్ దాడిలో ఒక పోలీసు మరణించాడు. దీంతో పాటు పలువురికి గాయాలయ్యాయి.


Also Read: Budget 2023: వ్యాపారులకు పెన్షన్ స్కీమ్.. బడ్జెట్‌లో ప్రధాన డిమాండ్స్ ఇవే..  


Also Read: Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ బాల్.. బ్యాట్స్‌మెన్ దిమ్మతిరిగింది  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి