Pakistan's telecom regulator has lifted ban on TikTok: చైనాకు చెందిన పాపులర్ షార్ట్ వీడియో యాప్ 'టిక్​ టాక్​'పై నిషేధం (Tik Tok Ban) ఎత్తివేసింది పాకిస్థాన్​. పాకిస్థాన్ టిక్​టాన్​ను బ్యాన్ చేయడం, దానిని ఎత్తివేయడం ఇది నాలుగో సారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అశ్లీల, అనైతిక కంటెంట్​ను నియంత్రిస్తామని హామీ ఇవ్వడంతో పాకిస్థాన్​ టెలికాం నియంత్రణ సంస్థ (పీటీఏ) తాజాగా టిక్​ టాక్​పై నిషేధం (Pak Lifetd Ban on Tik Tok) ఎత్తివేసింది.


జులై 20న బ్యాన్​..


పీటీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. అనుచిత కంటెంట్​పై నియంత్రణ లేదని కారణంతో జులై 20న టిక్​టాక్​పై నిషేధం విధించింది పాకిస్థాన్​. అప్పటి నుంచి ఈ విషయంపై టిక్​టాక్ యాజమాన్యం ప్రభుత్వంతో చర్చలు జరపగా.. తాజాగా దీనిపై ఓ అహగాహనకు వచ్చినట్లకు తెలిసింది.


Also read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!


టిక్‌టాక్‌లో "చట్టవిరుద్ధమైన కంటెంట్"ని అప్‌లోడ్ చేయడంలో నిరంతరం ప్రమేయం ఉన్నందుకు సోషల్ మీడియా కంపెనీ వినియోగదారులను బ్లాక్ చేస్తామని కూడా టిక్​ టాక్ హామీ ఇచ్చిందని తెలిపింది పీటీఏ.


టిక్​టాక్ ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిషేధం ఎత్తివేతకు ఆదేశించినట్లు పేర్కొంది నియంత్రణ సంస్థ. అయితే టిక్​టాక్​పై పర్యవేక్షణ మాత్రం (Pak on Tik tok) కొనసాగుతుందని స్పష్టం చేసింది.


Also read: పాకిస్తాన్ మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో లీక్... సోషల్ మీడియాలో వైరల్... పోలీసులకు ఫిర్యాదు


భారత్​లో 2020 నుంచి బ్యాన్​..


భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తున్నాయి అనే ఆరోపణతో టిక్​టాక్ సహా.. 59 చైనా యాప్​లపై గత ఏడాది జూన్ 29న నిషేధం విధించింది ప్రభుత్వం. తిరిగి భారత్​లో కార్యకలపాలు ప్రారంభించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది టిక్​ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్​. అయితే ఆ ప్రయత్నాలేవి సఫలం కాలేదు. దీనితో టీక్​టాక్ కార్యకలాపాలు భారత్​లో (Tik Tok life Time Ban in India) పూర్తిగా నిలిచిపోయాయి.


Also read: అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోసుకు అర్హులే!


Also read: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook