TikTok App: చైనా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్, టిక్‌టాక్‌పై నిషేధం తొలగింపు
వివాదాస్పద టిక్‌టాక్ పై బ్యాన్ ను పాకిస్తాన్ ఎత్తివేసింది. ప్రజాభిప్రాయం కంటే చైనా ఒత్తిడికే పాకిస్తాన్ ప్రభుత్వం విలువిచ్చింది. చైనా నుంచి పెరిగిన ఒత్తిడి నేపధ్యంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్.
వివాదాస్పద టిక్‌టాక్ ( TikTok ) పై బ్యాన్ ను పాకిస్తాన్ ( Pakistan ) ఎత్తివేసింది. ప్రజాభిప్రాయం కంటే చైనా ఒత్తిడికే పాకిస్తాన్ ప్రభుత్వం విలువిచ్చింది. చైనా నుంచి పెరిగిన ఒత్తిడి నేపధ్యంలో నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్.
మిత్రదేశం చైనా ( China ) ఒత్తిడికి పాకిస్తాన్ ఎట్టకేలకు తలొంచింది. దేశంలోని ప్రజల ప్రయోజనాల కంటే చైనా కంపెనీ ప్రయోజనాలే మిన్నగా భావించినట్టుంది. నిషేధాన్ని ఎత్తివేసింది. అనైతిక, అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మారిన టిక్‌టాక్ యాప్ ( Pakistan Banned TikTok app ) ను పాకిస్తాన్ ఇటీవల బ్యాన్ చేసింది. చట్టపరమైన కఠిన చర్యలను చేపట్టడంలో టిక్‌టాక్ యాజమాన్యం విఫలమైందని, అసభ్యతతో కూడిన కంటెంట్ ఎక్కువగా ఉంటుందని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ( పీటీఏ ) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 9న నిషేధం విధించి చైనాకు ఊహించని షాక్ ఇచ్చింది. సమాజంలోని వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన తరువాత ఈ చర్య తీసుకున్నట్లు పీటీఏ ( PTA ) తెలిపింది. నిషేధం విధించిన పదిరోజుల్లోనే వెనుకడుగేసింది పాకిస్తాన్. టిక్‌టాక్‌ను తిరిగి పునరుద్ధరించింది. నిషేధాన్నితొలగించి ( Pakistan lifts the ban on TikTok ) యధావిదిగా యూజర్స్‌కు అందుబాటులో తెచ్చేసింది.
మరి ఈ మాత్రం దానికి అంత హడావిడి ఎందుకు చేసినట్టనే సందేహాలు వస్తున్నాయి. ప్రజల్నించి వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో నిషేధం విధించినప్పటికీ..చైనా నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టిక్‌టాక్‌ను నిషేధించినప్పటి నుంచి తిరిగి పునరుద్ధరించేలా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఒత్తిడి పెరిగిందనేది ప్రదానంగా విన్పిస్తున్న మాట. ఇండియా ఇప్పటికే ఈ యాప్ తో పాటు 59 చైనా యాప్ ( India banned chinese apps ) లను నిషేధించింది. అమెరికా సైతం నిషేధం విధించినా..ఆ దేశంలోని కోర్టులు అభ్యంతరంతో ప్రస్తుతానికి నిషేధ నిర్ణయం నిలిచిపోయుంది. Also read: New Zealand: రెండోసారి ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్