పాకిస్థాన్‌ మరోసారి భారత సాంకేతిక వ్యవస్థపై ప్రతికూల వ్యాఖ్యలు చేసింది. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగంపై తన అభ్యంతరాన్ని బహిరంగంగానే వెల్లగక్కింది. ఇలాంటి ప్రయోగాల వల్ల భారత సరిహద్దు దేశాలతో వివాదాలు తెచ్చుకుంటుందని తెలిపింది. వ్యతిరేక ప్రభావాన్ని చూపించే ఇలాంటి ప్రయోగాలకు భారత్ తెరదించాలని ఈ సందర్భంగా తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాలశాఖ ప్రతినిధి డాక్టర్‌ మహ్మద్‌ ఫైజల్‌ మీడియాతో మాట్లాడుతూ "మాకు లభించిన నివేదిక మేరకు భారత్ కార్టోశాట్ శాటిలైట్‌తో పాటు మరో 31 ఉపగ్రహాలను త్వరలో ప్రయోగిస్తుందని తెలుసుకున్నాం. కానీ ఆ ఉపగ్రహాలు ప్రజలకు ఉపయోగపడడంతో పాటు సైనిక వ్యవస్థకు కూడా పనికివచ్చేలా రూపొందించారని తెలుస్తోంది.


అదే జరిగితే భారత్ చర్యలు ఇరు దేశాల సంబంధాలపై వ్యతిరేక సిగ్నల్స్ పంపిస్తున్నట్లు మేము అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఏదైనా దేశాలు సాంకేతికతను శాంతిని పెంపొందించడానికే వినియోగించాలి కానీ.. వేరే దేశ సైనిక వ్యవస్థ రక్షణకు భంగం కలిగించేలా ఉండకూడదు అనేది మా అభిప్రాయం" అని ఆయన తెలిపారు.