Pakistan Petrol Diesel Price: పాకిస్తాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొద్ది నెలలుగా అక్కడ ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై మరో రూ.14.84 (పీకేఆర్-పాకిస్తాన్ రూపీ) మేర, లీటర్ హైస్పీడ్ డీజిల్‌పై రూ.13.23 మేర ధర పెరిగింది. పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్ ధర రూ.248.74, లీటర్ హైస్పీడ్ డీజిల్ ధర రూ.276.54కి చేరింది. కిరోసిన్, లైట్ డీజిల్ ధరలు కూడా రూ.18.83, రూ.18.68 మేర పెరిగాయి. పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌, కిరోసిన్‌పై రూ.5 మేర ప్రభుత్వం పన్ను విధించింది.పెరిగిన ధరలు జూలై 1వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్జాతీయ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా పాకిస్తాన్ రూపీ విలువ నిలకడగా లేకపోవడం  తదితర కారణాలతో ఇంధన ధరలు సవరించాలని నిర్ణయించినట్లు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ప్రకటించారు. ప్రభుత్వం సబ్సిడీలను భరించేందుకు ఏమాత్రం సిద్దంగా లేదని చెప్పారు. గత పాకిస్తాన్ ప్రభుత్వం పీటీఐ హయాంలో దేశం రూ.233 బిలియన్లు నష్టపోయిందన్నారు. 


పీటీఐ ఐఎంఫ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పెట్రోల్‌పై రూ.30 వరకు లెవీ (పన్ను) విధించాల్సి ఉందన్నారు. కానీ ప్రభుత్వం ప్రజలకు కాస్త రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏ రకమైన పన్నులు పెంచలేదన్నారు.దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ముసాదిక్ మాలిక్ పేర్కొన్నారు.


పాకిస్తాన్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో పీఎంఎల్ ఎన్ నేత్రుత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలపై బాదుడు కొనసాగుతూనే ఉంది. మొదట మే నెలలో రూ.30, రూ.26 మేర ధరలు పెరగా.. జూన్ 2న రూ.30, జూన్ 15న రూ.24, తాజాగా మరో రూ.15 మేర ధర పెరిగింది. పెరిగిన దరలతో పాకిస్తాన్‌లోని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.


Also Read: CM Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలి!.. రామ్ సినిమా ఈవెంట్లో బ్యానర్లు


Also Read: CM Kcr on PM Modi: ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు..మోదీపై సీఎం కేసీఆర్ ఫైర్..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook