పాకిస్తాన్ విమాన ప్రమాద సీసీటీవీ దృశ్యాలు..!!
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ..PIAకు చెందిన PK-8303 విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు చేరుకుంది. ఐతే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే బతికి బయటపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న విమానం నిన్న జనావాసాలపై కుప్పకూలడం తెలిసిందే.
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ..PIAకు చెందిన PK-8303 విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 97కు చేరుకుంది. ఐతే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మాత్రమే బతికి బయటపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న విమానం నిన్న జనావాసాలపై కుప్పకూలడం తెలిసిందే.
కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అతి సమీపంలో ఉన్న మోడల్ కాలనీ జనావాసాలపై విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణీకులు సహా 8 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 97 మంది చనిపోయారు. మరో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిని కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీ వెలువడింది. ల్యాండింగ్ సమయంలో పట్టు కోల్పోయిన విమానం జనావాసాలపై పడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కరాచీలోని ఓ భవనంపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.
సాంకేతిక లోపం తలెత్తడంతోనే విమానం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. దీనికి సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చాడు. కానీ కొద్దిక్షణాల్లోనే ప్రమాదం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ల్యాండింగ్ కు కొద్ది నిముషాల ముందే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విమాన ప్రమాదం కారణంగా మోడల్ కాలనీలో 5 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఏడు కార్లు ధ్వంసమయ్యాయి.
[[{"fid":"185923","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..