Pakistan Crisis: పాకిస్తాన్‌లో గెలిచిన అవిశ్వాసం, కుప్పకూలిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం, కొత్త ప్రధాని ఎవరు
Pakistan Crisis: పాకిస్తాన్‌లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాసం మూటగట్టుకుని అవమానభారంతో పదవి నుంచి వైదొలిగారు.
Pakistan Crisis: పాకిస్తాన్‌లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాసం మూటగట్టుకుని అవమానభారంతో పదవి నుంచి వైదొలిగారు.
ఇమ్రాన్ ఖాన్. క్రికెట్ నుంచి రాజకీయంలో ఎంట్రీ ఇచ్చి..తొలుత ఓడిపోయినా..పట్టు వదలక పోరాడి..ప్రజాబలంతో పార్టీని అధికారమెక్కించిన నేత. పాకిస్తాన్‌లో ఎంత ప్రజాకర్షణ ఉన్నా..అంతా కోల్పోయారు. ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా 174 మంది సభ్యులు ఓటేశారు. మెజార్టీ సభ్యులు తీర్మానానికి మద్దతివ్వడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతడయ్యారు. పీటీఐ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనకుండా వాకౌట్ చేశారు. ఓటమి ముందే ఊహించిన ఇమ్రాన్ ఖాన్...ఓ వైపు ఓటింగ్ జరుగుతుండగానే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసంలో ఓడిన తొలి వ్యక్తిగా అపకీర్తి మూటగట్టుకున్నారు.
కొత్త ప్రధాని ఎవరు
పాకిస్తాన్ కొత్త ప్రధానిగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెబాజ్ షరీఫ్ బాథ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీతో సమావేశమై కొత్త ప్రభుత్వం ఏర్పాటు గురించి చర్చించనున్నారు.
ఆ కలయికలో ఏం జరిగింది
వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ మొదట్నించీ అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటల 30 నిమిషాలకే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశమైనా..పాక్ మంత్రులు వ్యూహం ప్రకారం సుదీర్ఘ ప్రసంగాలతో కాలయాపన చేశారు. ఓటింగ్ ఆలస్యం చేస్తూ వచ్చారు. అలా అర్ధరాత్రి వరకూ హైడ్రామా సాగింది. ఓ వైపు సభ జరుగుతుంటే మరోవైపు పాకిస్తాన్ కేబినెట్ సమావేశమైంది. ఆర్మీ నాయకత్వంలో మార్పుల్ని ఖండించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఏ ఛీఫ్‌లు ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. కారణమేంటనేది ఇంకా తెలియలేదు. ఓ వైపు సభలో గందరగోళం, ఓటింగ్ ఉన్న నేపధ్యంలో ఇమ్రాన్ ఖాన్‌తో వీరి కలయిక అంతుచిక్కడం లేదు. అంతవరకూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న ఇమ్రాన్ ఖాన్..అధికార నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం వెనుక మర్మమేంటనేది తెలియడం లేదు. ఆ తరువాత కాస్సేపటికి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ తిరిగి సమావేశం కావడం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు తమ పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య ఓటింగ్ జరిగింది. అనుకున్నట్టే..అవిశ్వాసం నెగ్గింది. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడయ్యారు.
Also read: Girls Cutting Hair: వారి నుంచి తప్పించుకునేందుకు.. జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook