Operation Ganga: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంతో నెలకొన్ని సంక్షోభంలో భారత్​ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఈ ఆపరేషన్​ ద్వారా ఇప్పటికే వందలాది మందిని స్వదేశానికి రప్పించింది. మరింత మందిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇండియా.. భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశ పౌరులను కూడా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడేందుకు సహాయపడుతోంది. ఉక్రెయిన్​ నుంచి రోడ్డు మార్గం ద్వారా రొమానియాలోని బుకారెస్ట్​ నగరానికి చేరుకున్న పలువురు విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం.. మన త్రివిర్ణ పతాకం భారతీయులను మాత్రమే కాకుండా పలువురు పాకిస్థాని, టర్కీష్​ విద్యార్థులను కూడా.. చెక్​పోస్ట్​లను దాటించేందుకు సహాయం చేసిందని వివరించారు.


ఏమిటి ఈ ఆపరేషన్ గంగా..


ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందకు ఆపరేషన్ గంగాను ప్రారంభించింది ప్రభుత్వం. యుద్ధం కారణంగా ఉక్రెయిన్​ మీదుగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో ఉక్రెయిన్​కు సమీప దేశాలకు భారతీయులను రోడ్డు మార్గం ద్వారా తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఇండియాకు రప్పిస్తోంది. ఈ ఆపరేషన్ కోసం ఎయిర్​ ఇండియా, స్పైస్​ జెట్​, ఇండిగో ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి.


అయితే ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులు సమీప దేశాలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. వారు ప్రయాణించే వాహనాలకు జాతీయ జెండాను పెట్టాలని సూచించింది కేంద్రం. భారత జాతీయ పతాకం ఉన్న వాహనాలపై ఎవరూ దాడులు చేయరని కూడా వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఉక్రెయిన్ సరిహద్దు దేశాలతో చర్చలు కూడా జరిపింది.



దీనితో ఉక్రెయిన్​లోని భారతీయ విద్యార్థులు భారత జాతీయ పతాకాలను పట్టుకుని ఉక్రెయిన్ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్తున్నారు. భారత జాతీయ జెండా ఉంటే.. చెక్​పోస్టులు, సరిహద్దులు వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో.. కొంత మంది పాకిస్థానీలు కూడా.. తివర్ణ పతాకాలు పట్టుకుని బార్డర్ దాటుతున్నారని తెలిసింది. అక్కడి నుంచి స్వదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు కొంత మంది విద్యార్థులు.


సంక్షోభం సమయంలో భారత జాతీయ పతాకం తమకు సహాయం చేసినందుకు, ఇండియన్ ఎంబసీలో భారతీయులతో పాటు ఇతర దేశీయులకు కూడా ఫుడ్​, షెల్టర్​ ఇస్తున్నందుకు భారత్​కు కృతజ్ఞతలు చెబుతున్నారు ఆయా దేశాల విద్యార్థులు.


Also read: Ukraine Crisis: రష్యన్ మిలటరీ ట్యాంకును ఎత్తుకెళ్లిన ఉక్రెయిన్‌ రైతు, వీడియో వైరల్


Also read: Indians In Ukraine: షాకింగ్ న్యూస్! ఉక్రెయిన్ నుంచి వెళ్లాలనుకునే ఇండియన్స్‌ని కొడుతున్నారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook